పౌరసత్వ బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో జెడియూ రెండుగా చీలిపోయింది. పౌరసత్వ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్న జెడియూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ నిర్ణయాన్ని ఆ పార్టీ నాయకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యతిరేకించారు. ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నాయకుడు జాతీయ అధికార ప్రతినిధి పవన్ వర్మ పార్టీనే వదలిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా పౌరసత్వ చట్టం వచ్చినందున దాన్ని వ్యతిరేకించాలని పవన్ వర్మ జెడియూ అధ్యక్షుడు నితిష్ కుమార్ ను కోరారు.
అయితే పవన్ వర్మ చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా నితిష్ కుమార్ బిజెపి ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలిపారు. దాంతో పార్టీలో కొనసాగడం తనకు ఇష్టం లేదని పవన్ వర్మ ప్రకటించారు. నితిష్ కుమార్ అధికారం మాత్రమే కోరుకుంటున్నారని వర్మ ప్రకటించారు. పౌరసత్వ సవరణకు మద్దతు ఇవ్వడం సరైనది కాదని, నితిష్ కుమార్ చర్యలు తనను నిరాశపరిచాయని వర్మ తెలిపారు.