38.2 C
Hyderabad
May 3, 2024 20: 21 PM
Slider మహబూబ్ నగర్

రౌడీ షీటర్ల పై ప్రతి రోజూ నిఘా పెట్టాలని ఎస్ పి ఆదేశం

#Gadwal Police

జోగుళాoబ గద్వాల్ జిల్లా లో ఉన్న రౌడీ షీటర్ల ప్రవర్తన ను రోజు వారిగా గమనించి రిపోర్ట్ తయారు చేయాలని, తరచుగా నేరాలకు పాల్పడే వారి పై పి. డి యాక్ట్ కేసు నమోదుకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ జిల్లా పోలీస్ అధికారులకు సూచించారు.

మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ని సమావేశ హాల్ లో ఆయన ఎస్సై లు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, డి.ఎస్పీ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు క్రిమినల్ కార్యకలపాలలో పాల్గొంటున్నారో లేదో నిఘా ఉంచి రోజు వారీ రిపోర్ట్  తయారు చేసుకోవాలని ఆదేశించారు.

జిల్లాలో మర్డర్ కేసులలో ఉన్న నిందితులు ఎలాంటి కార్యకలపాలలో ఉంటున్నారో, ఇరువర్గాల కు ఘర్షణలు జరిగే అవకాశం ఉండే అలాంటి వారిని గుర్తించాలని, తరచుగా ఇసుక, గుట్కా, PDS రైస్ అక్రమ రవాణా చేసే వారిపై పి. డి యాక్ట్ కేసు నమోదుకు ప్రతిపాదనలు పంపాలని ఆయన ఆదేశించారు.

ఏదయినా నేరం జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ ను పారదర్శకంగా చేపట్టాలని, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ను పెంపొందించుకోవాలని అన్నారు. జిల్లా లో విజిబుల్ పోలీసింగ్ ను మరింత పెంచాలని, పట్టణాలలో వ్యాపార సంస్థలలో, రోడ్డు పై మాస్కులు ధరించని వారి పై e పెట్టి కేసులు నమోదు చేసేటప్పుడు ఫోటోలు కూడా తీసుకొని అప్లోడ్ చేయాలని ఆయన కోరారు.

ఈ చాలన్స్ లో వాహన దారులకు పడిన జరిమానాలను చెల్లించుకునే విధంగా వారిని అప్రమత్తం చేయాలని, 3 సార్లు జరిమానాలు విధించిన చెల్లించని వాహనాలను సీజ్ చేయాలని వారు జరిమానాలు చెల్లించిన అనంతరం వారి వాహనాలను అప్పగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కె. కృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి, CCS ఇన్స్పెక్టర్ గోపి, IT సెల్ సిబ్బంది, డి. సి ఆర్ బి సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మానస్ నాగులపల్లి నటించిన క్షీరసాగర మథనం చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో రెండో స్థానం

Satyam NEWS

రోడ్డు బాగు చేయాలని బహుజనుల నిరసన దీక్ష

Satyam NEWS

అప్పుల కుప్పగా మారిన తెలంగాణ విద్యుత్ రంగం

Satyam NEWS

Leave a Comment