40.2 C
Hyderabad
April 29, 2024 18: 17 PM
Slider గుంటూరు

రోడ్డు బాగు చేయాలని బహుజనుల నిరసన దీక్ష

#villagersprotest

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు గ్రామ ప్రధాన రహదారి పూర్తిగా పాడైపోయి గుంతలమయమైందని కనీసం కాలినడకన వెళ్ళడానికి కూడా రహదారి అనుకూలంగా లేదని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ అన్నారు.

ఈ రహదారిలో  ఎంతోమంది యాక్సిడెంట్లకు గురయ్యారని  కనీసం గర్బిణీ స్త్రీలను హాస్పటల్ కు అంబులెన్స్ లో తరలించేలోపే ప్రసవాలు జరుగుతున్న దుస్థితి అని ఆయన అన్నారు. తక్షణమే రావిపాడు-నల్లగార్లపాడు గ్రామాల మధ్యనున్న ప్రధాన రహదారి సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లగార్లపాడు గ్రామస్తులతో కలసి నల్లగార్లపాడు ప్రధాన రహదారిపై నేడు ఆయన నిరసన దీక్ష చేపట్టారు.

అనంతరం నిరసన దీక్షలో రమేష్ కుమార్ మాట్లాడుతూ రహదారి సమస్య పరిష్కరించాలని ఇప్పటికే నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని, పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ను,నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలును  కలిసి రోడ్డు సమస్య పరిష్కరించాలని కోరినా రోడ్డు సమస్యను పరిష్కరించ లేదని ఆయన అన్నారు.

ఇప్పటికైనా సమస్య పరిష్కారంకాకపోతే పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపడతామని తెలంగాణా రాష్ట్రంలో రోడ్ల గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఉదాహరణే రావిపాడు-నల్లగార్లపాడు గ్రామాల మధ్యనున్న ప్రధాన రహదారి అని ఇంత అధ్వాన్నంగా ఉన్న రోడ్డు సమస్య పరిష్కారం అయ్యేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

అనంతరం రొంపిచర్ల ఏ ఎస్ ఐ మణివరకుమార్ దీక్ష వద్దకు చేరుకొని రోడ్డు సమస్య ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన దీక్షను విరమించారు. ఈ దీక్ష ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగింది.

ఈ కార్యక్రమంలో రొంపిచర్ల మండల తెలుగు రైతు జనరల్ సెక్రెటరీ గాదె రాఘవరెడ్డి, అచ్చి అంకిరాజు,అచ్చి పెదరాజు,అన్నపురెడ్డి అంకిరెడ్డి, ద్రోణాదుల పెద్దిరెడ్డి, చిరంజీవి, నాగరాజు,చిలకా నాగయ్య మరియు విద్యార్థినీ,వి ద్యార్థులు “మా గ్రామ రహదారి బాగుచేయించండి మహా ప్రభో అంటూ ప్లకార్డులతో  దీక్షలో పాల్గొన్నారు.

Related posts

ఆనందయ్య కరోనా మందుకు ఏపి ప్రభుత్వం అనుమతి

Satyam NEWS

వర్ష బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ చిరు సాయం

Satyam NEWS

అత్యాచార బాధితురాలికి అసభ్య ప్రశ్నలతో ఇబ్బంది

Satyam NEWS

Leave a Comment