34.2 C
Hyderabad
May 19, 2025 17: 45 PM
Slider నల్గొండ

ఎమ్మెల్యే సైదిరెడ్డిని యువత ఆదర్శంగా తీసుకోవాలి

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, రానున్న రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా  కల్పించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారని, టిఆర్ఎస్ నాయకులు గెల్లి రవి అన్నారు.  

మంగళవారం MLA శానంపూడి సైదిరెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు, ఆయన జీవిత ప్రయాణంపై  ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని సైదిరెడ్డి జనని శానంపూడి సత్యవతి ఆవిష్కరించారు.

తర్వాత కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సైదిరెడ్డి  మిత్రులు నడిపల్లి సురేష్ కుమార్,  హుజుర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, కౌన్సిలర్ అమరబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అర్హులైన ముస్లిం సోదరులకు షాపును కేటాయించాలి

Satyam NEWS

కురుమ, యాదవులను దగా చేస్తున్న కేసీఆర్

Satyam NEWS

విద్యుత్ బిల్లు వసూలుకు వెళ్తున్న అధికారులకు చుక్కెదురు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!