29.7 C
Hyderabad
May 4, 2024 03: 12 AM
Slider పశ్చిమగోదావరి

ఏలూరు డివిజన్ స్థాయి క్రీడల్లో పెదవేగి క్రీడాకారుల ప్రతిభ

#pedavegi

సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన ఏలూరు డివిజన్ స్థాయి క్రీడా సంబరాలలో పెదవేగి మండలం తరపున పాల్గొన్న క్రీడాకారులు శుక్రవారం విన్నర్స్ గా నిలిచి జిల్లా అధికారుల అభినందనలు అందుకున్నారు. ఏలూరు ఏ ఎస్ ఆర్ స్టేడియం లో జరిగిన వాలీబాల్ పోటీలో పెదవేగి క్రీడాకారులు  చిచ్చర పిడుగుల్లా రెచ్చిపోయి విజేతలుగా నిలిచారు. పెడవేగి  క్రీడాకారులను ఎంపిక చేసిన తహసీల్దార్ నాగరాజు ని ఏలూరు ఆర్ డి ఓ పెంచల్ కిషోర్ తో బాటు జిల్లా అధికారులు అభినందించారు.

వాలీబాల్ ఆటలో చెలరేగి పోయి విన్నర్లుగా నిలిచిన క్రీడాకారులను  కూడా  ఏలూరు ఆర్ డి ఓ పెంచల్ కిశోర్ ప్రత్యేకంగా అభినందించారు. పెదవేగి మండలం తరపున మెరికల్లాంటి క్రీడా కారులను ఎంపికచేసిన    తహసీల్దార్ నల్లమెల్లి నాగరాజు పై పలువురు పెదవేగి మండల స్థాయి అధికారులు ప్రశంసల జల్లులు కురిపించారు. విన్నర్స్ గా నిలిచిన పెదవేగి క్రీడా కారులకు 25 000.రన్నర్స్ గా నిలిచిన గణపవరం క్రీడాకారులకు 15000 రూపాయలు నగదు బహుమతులను  ఆర్ డి ఓ పెంచల్ కిషోర్ చేతుల మీదగా శుక్రవారం అందజేశారు.

కోడిపందాలు, జూదాలును నిరోధించడానికి ప్రభుత్వం ప్రజల దృష్టి  క్రీడల వైపు మరల్చడానికి చేసిన ప్రయత్నం ఏలూరు డివిజన్ లో మంచి పాలితాలనిచ్చిందని జిల్లా అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు ఎ ఎస్ ఆర్ స్టేడియంలో జరిగిన సంక్రాంతి  సంబరాలు యువతలో మంచి క్రీడా స్ఫూర్తిని నింపాయి. ఏలూరు డివిజన్ లో అన్ని మండలాల  నుండి క్రీడా కారులు  ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు తహసీల్దార్ బి సోమశేఖర్, డి ఎస్ డి ఓ తదితర అధికారులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం నడి రోడ్ పై డ్రంక్ అండ్ డ్రైవ్…!

Satyam NEWS

దిశ చ‌ట్టం…అదే ఫేక్ …అస్స‌లు “దిశ “చ‌ట్ట‌మే లేదు…!

Satyam NEWS

థాంక్స్ టు మినిష్టర్ కేసీఆర్

Satyam NEWS

Leave a Comment