30.7 C
Hyderabad
April 29, 2024 04: 35 AM
Slider విజయనగరం

విజయనగరం నడి రోడ్ పై డ్రంక్ అండ్ డ్రైవ్…!

#vijayanagaram

విజయనగరం లో సమయం… సాయంత్రం 06.30..నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అదీ ఐనాక్స్ వద్ద ఒకటే రద్దీ. వచ్చే పోయే వాహనాలొకవైపు…ఆర్టీసీ కాంప్లెక్స్ లో వచ్చే పోయే బస్సులు ఓ వైపు. సరిగ్గా అప్పుడే ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందంకు ట్రాఫిక్ ఎస్ఐ దామోదర్…ప్రభుత్వం కేటాయించిన జీపు లో హోమ్ గార్డ్ కాశీ డ్రైవర్ గా ఉంటూ కాంప్లెక్స్ వద్ద ఐనాక్స్ కేంద్రం వద్దకు వచ్చారు.

అప్పుడే అక్కడే విధులు నిర్వహిస్తున్న పీసీ సింహాచలం.. మద్యం సేవించి బైక్ నడుపు పడిపోతున్న వ్యక్తి ని పట్టుకున్నామంటూ ఎస్ఐ దామోదర్ కు చెప్పడం తో మిషన్ ద్వారా పరీక్ష చేస్తే మోతాదుకు మించి…580 చూపించడంతో పోలీసులు నిశ్చేష్ఠులయ్యారు.పైగా సదరు వ్యక్తి ట్రాఫిక్ ఎస్ఐ నే వేలెత్తి చూపించడంతో… అక్కడే ఉన్న స్థానికులు ముక్కు న వేలేసుకున్నారు.వెంటనే  ట్రాఫిక్ ఎస్ఐ… తన సిబ్బంది తో మద్యం పరీక్ష పూర్తవడంతో కేసు కట్టి బైక్ ను స్టేషన్ కు పంపించి..అతగాడి బంధువును పిలిపించి.. దగ్గరుండి అప్పగించి…మెజిస్ట్రేట్ ఫోన్ చెయ్యగానే కోర్టు కు తీసుకెళ్లాలని చెప్పడంతో గలటా అక్కడికి సర్దుమణిగింది.

Related posts

ఖమ్మం లో అభివృద్ధి ఘనం

Bhavani

ఇమేజ్ ప్రాసెసింగ్ పై సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్

Satyam NEWS

మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment