26.7 C
Hyderabad
May 15, 2024 07: 16 AM
Slider మహబూబ్ నగర్

అర్హతలేనోడికి  అధికారం ఇస్తే రోడ్లపై ధర్నాలు చేయబట్టే

#rangineni

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా?  అంటే వందకు 90శాతం  అవుననే అంటున్నారు. ఈ అవకాశాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకోవడానికి సిద్ధం అవుతోందని మాటలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని అనిపిస్తుంది.

సుమారు 20 ఏళ్లు పాలించిన ప్రస్తుత మాజీ మంత్రి,ఆనాటి అధికార కార్ గుర్తు పార్టీ అభ్యర్థి మంత్రి జూపల్లి కృష్ణారావును 12495 ఓట్లతో  కాంగ్రెస్ పార్టీ  ఓడించింది. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. అయితే ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం  టీఆర్ఎస్ పార్టీలోకి వలస వెళ్లారు. ఆ తర్వాత ఈ మూడున్నర సంవత్సరాలలో నియోజకవర్గంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి.

మార్పుకొరుకున్నారు కానీ  ఈ మాత్రం మార్పు కొరకోలేదని ప్రజలు ప్రస్తుతం ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. అయితే  ఇక్కడ మాజీ మంత్రి జూపల్లి  రాజకీయం ఒక మాదిరిగా ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాత్రం  అధికార పార్టీని ఎదురుగా ఢీ కొంటుంది. కాంగ్రెస్ పార్టీ టిపీసీసీ  అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఇచ్చిన పిలుపు మేరకు కొల్లాపూర్ నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమంలో  చింతలపల్లి జగదీశ్వర్ రావు, బహుజన కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుపుకోని రంగినేని ప్రజలలోకి వెళుతున్నారు.

రచ్చబండలో పాలకులను  ఎండగడుతున్న రంగినేని

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నేతలు కొల్లాపూర్ నియోజకవర్గంలో వరంగల్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని గడపగడపకు తీసుకుపోతున్నారు. అయితే ఈ సందర్భంగా ఇక్కడ నియోజకవర్గ నాయకులు ఎవరు మాత్రం స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలను ఎండగట్టడం లేదు.

రంగినేని అభిలాష్ రావు వరంగల్ డిక్లరేషన్ గడపగడపకు తెలుపుతూ, రైతులతో మాట్లాడుతూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూన్నారు.. అటు  రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజలకు ఎలాంటి అన్యాయాలు చేస్తున్నారో కరాఖండిగా రంగినేని అభిలాష్ రావు ప్రజలకు వివరిస్తున్నారు.

ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజల సమస్యలపై రోడ్ల మీద కూర్చున్న పరిస్థితిని చూశాము కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యేలు వరి కొనుగోలు పై రోడ్ల మీద కూర్చొని చేస్తున్న నాటకాలను చూడాల్సిన పరిస్థితి ప్రజలకు వచ్చిందని ఆయన విమర్శిస్తున్నారు. ప్రజల సమస్యలు తీర్చాలని అధికారం ఇస్తే ఇలా రోడ్డు మీద కూర్చొని కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు రాజకీయ నాటకాలు చేస్తున్నారని రైతులకు రంగినేని తెలియచేస్తున్నారు.

నియోజకవర్గంలో ఆసుపత్రులలో వైద్యులు లేరు. ఆస్పత్రిలో చికిత్సను అందించే వైద్యులు కరువయ్యారని రంగినేని ఆరోపిస్తున్నారు. అంతకన్నా ఎక్కువగా వరంగల్ డిక్లరేషన్ క్లుప్తంగా రైతులకు, ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా రైతులకు ఏ విధంగా  మేలు చేస్తారో  రైతులకు, ప్రజలకు వివరిస్తున్నారు.

అదేవిధంగా రైతులతో సమస్యలను  మాట్లాడిస్తున్నారు. ప్రజలకు మేలు చేయాలని అధికారమిస్తే రోడ్లపై ధర్నాలు చేస్తూ రాష్ట్రంలో ఆ దిక్కు మాలినొడు కేసీఆర్, ఆ ముదనష్టవోడు చిన్నంబాయి చౌరస్తాలో ధర్నాలు చేయబట్టే అంటూ రంగినేని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

మాస్టర్ ప్లాన్ మార్చకపోతే ఆత్మహత్యలే శరణ్యం

Satyam NEWS

రేపు కరీంనగర్ లో దసరా సినిమా విజయోత్సవ సభ

Bhavani

NH167/A రహదారి మార్గాన్ని మార్చాలి

Bhavani

Leave a Comment