26.7 C
Hyderabad
May 1, 2025 03: 59 AM
Slider ఆదిలాబాద్

సమత అత్యాచారం కేసులో ఎదురుతిరిగిన నిందితులు

samatha

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కలకలం రేపిన ‘సమత’ అత్యాచారం, హత్య కేసులో ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. నిందితులు షేక్‌ బాబు, షేక్‌ షాబుద్దీన్‌, షేక్‌ ముగ్దుంలను కోర్టు విచారించింది. వారు ఈ నేరాన్ని అంగీకరించలేదు. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. సమత నిందితులపై కోర్టు నేరారోపణ అభియోగాలు ఖరారు చేసింది.

నిందితుల తరఫున న్యాయవాది రహీం కోర్టులో డిశ్చార్జి పిటిషన్ వేశారు. నిందితులతో మాట్లాడేందుకు న్యాయవాదికి న్యాయస్థానం అనుమతించింది. అనంతరం ఈ కేసును రేపటికి వాయిదా వేసింది. లింగాపూర్ మండలం ఎల్లపటార్‌లో సమతపై కొందరు మృగాళ్లు అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

Related posts

మరో యువతిపై ఇంట్లోనే అత్యాచార యత్నం

Satyam NEWS

అచ్యుతాపురం ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం

mamatha

ప్ర‌పంచంలోనే అత్యంత ఎక్కువ రాబడి ఉన్న చర్చి ఏదో తెలుసా?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!