40.2 C
Hyderabad
May 6, 2024 15: 07 PM
Slider రంగారెడ్డి

రామంతాపూర్ డివిజన్ సమస్యలపై విస్తృత పర్యటన

#uppal

రామంతాపూర్ డివిజన్ లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పల్ నియోజకవర్గ   బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం  బండారి లక్ష్మారెడ్డి,  ఉప్పల్ బిఆర్ఎస్ సీనియర్  నాయకులు గంథం నాగేశ్వరావు తో కలిసి రామంతపూర్  శ్రీరామ కాలనీలోని మహంకాళి అమ్మవారి కి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీ వాసులతో మాట్లాడి ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాలనీ కి సంబంధించి ఎటువంటి సమస్యలైన తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా తమవంతు సహాయ సహకారాలు అందించి పరిష్కారానికి  కృషి చేస్తానన్నారు. జనప్రియ,శాంతి నగర్ కాలని, అపార్ట్మెంట్ వాసులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పబ్లిక్ స్కూల్ గల్లి ముత్యాలమ్మ టెంపుల్ పునర్నిర్మాణ  కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో మధుసూదన్ రెడ్డి,ఆలే రమేష్,చంబు సాయి,తుట్ నరసింహ,వెంపటి శ్రీను,సాగర్,మహేందర్,రాజు యాదవ్,సాలార్, సురం శంకర్ ,ప్రశాంత్ గౌడ్,బోసాని పవన్,నరేష్,జహంగీర్,చాంద్ పాషా,ఆనంద్ తదితరులు  పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

మరో వివాదంలో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా

Sub Editor

తపాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు

Satyam NEWS

Leave a Comment