23.2 C
Hyderabad
May 7, 2024 19: 52 PM
Slider నల్గొండ

ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలి

#Chirumarthy Lingaiah MLA

ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది ఎంపీపీ కొలను సునీత వెంకటేశం గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… ప్రభుత్వ భూమి ఎక్కడ ఆక్రమణకు గురైన సహించేది లేదని అన్నారు. 

అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు.గ్రామాల్లో కృష్ణా నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పంట మార్పిడి విధానంపై పై రైతుల అభిప్రాయం ఎలా ఉందని ఎమ్మెల్యే సభ్యులను అడుగగా… సన్నరకం వరిని పండించడానికి చాలా మంది రైతులు సుముఖంగా ఉన్నట్లు సర్పంచులు  ఎమ్మెల్యే కు తెలిపారు.

కందులు కూడా పండిస్తే ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు చేసి  రైతు ఖాతాలో డబ్బు జమ చేస్తుందని అన్నారు. రైతులకు పంటల విషయంలో ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించాలని అన్నారు.

Related posts

విజయనగరం సెంట్రల్ అధ్వర్యం లో క‌బ‌డ్డీ పోటీలు….!

Satyam NEWS

పోలీస్ స్పంద‌న‌కు త‌గ్గుతున్న ఫిర్యాదు దారులు….!

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కర్ఫ్యూ వేళల్లో సడలింపులు

Satyam NEWS

Leave a Comment