29.7 C
Hyderabad
May 6, 2024 04: 40 AM
Slider ముఖ్యంశాలు

హైదరాబాద్ ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం

#TalasaniSrinivasaYadav

ఎన్నో సంవత్సరాలుగా ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎందుర్కొంటున్న పలు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదనీటి ముంపుకు గురైన పలు ప్రాంతాలలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ గురువారం పర్యటించారు. ముందుగా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ CIB, న్యూ CIB క్వార్టర్స్, MS.మక్తా ప్రాంతాలలో MLA దానం నాగేందర్, కార్పొరేటర్ విజయా రెడ్డి లతో కలిసి పర్యటించారు.

విద్యుత్ సరఫరాలేక ఇబ్బంది పడుతున్నాం

ఓల్డ్ CIB, న్యూ CIB క్వార్టర్స్ లో రోడ్లపై నీరు నిలిచిపోయి ఉండటం వలన ఇండ్ల లో నుండి బయటకు రాలేకపోతున్నామని, విద్యుత్ సరఫరా కూడా లేదని స్థానిక ప్రజలు మంత్రికి విన్నవించారు. ఎన్నో సంవత్సరాలుగా తాము వర్షాకాలంలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నామని మంత్రికి వివరించగా, స్పందించిన మంత్రి వెంటనే ముంపు ప్రాంతాలలోని ఇండ్ల నుండి ప్రజలను బయటకు తీసుకెళ్లేందుకు 2 బోట్ లను తెప్పించారు.

ఈ ప్రాంత ప్రజలు వ్యాధుల భారిన పడకుండా వెంటనే నివారణ కు మందులను స్ప్రే చేయాలని అధికారులను ఆదేశించారు. వరదనీటిని పూర్తిస్థాయిలో తరలించి విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 10 రోజులలలో అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.

డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బంది పడుతున్నాం

MS మక్తా లో సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడం వలన వర్షపు నీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మంత్రికి వివరించగా, వెంటనే డ్రైనేజి లైన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. అనంతరం అక్కడ నుండి బేగంపేట లోని బ్రాహ్మణవాడి లో కార్పొరేటర్ ఉప్పల తరుణి తో కలిసి పర్యటించారు.

పక్కనే ఉన్న నాలా లో పూడిక పేరుకపోయిన కారణంగా వర్షపు నీరు తమ కాలనీలోకి చేరుతుందని స్థానిక ప్రజలు మంత్రికి పిర్యాదు చేశారు. నాలాలో సిల్ట్ తొలగించడంతో పాటు రిటైనింగ్ వాల్ వెంట డ్రైనేజి పైప్ లైన్ నిర్మించి ప్రకాష్ నగర్ నాలా లో కలిపితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని స్థానికులు మంత్రికి వివరించారు.

సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు త్రాగునీరు, పాలు, ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తదనంతరం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మారుతీనగర్ లో MLA ముఠా గోపాల్ తో కలిసి పర్యటించారు.

హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల అప్రమత్తం

హుస్సేన్ సాగర్ నుండి దిగువకు నీరు వెళుతున్న నాలా వెంట ఉన్న ఇండ్లను పరిశీలించి ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తుగా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే నగరంలో అనేక ప్రాంతాలలో వరదనీటి ముంపుకు గురై ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. భవిష్యత్ లో నగరంలో ముంపు ప్రాంతాలు లేకుండా తగు ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి చెప్పారు. గడిచిన 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో GHMC పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ హెల్ప్ లైన్ లకు పలు సమస్యలపై ఈరోజు మధ్యాహ్నం వరకు 4356 పిర్యాదులు వచ్చినట్లు వివరించారు.

హెల్ప్ లైన్ లకు వచ్చే పిర్యాదులపై క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు, సిబ్బందితో సమీక్షించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులతో పరిస్ధితులను సమీక్షిస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తుందని చెప్పారు.

ప్రజలు దైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటూ అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట వాటర్ వర్క్స్ DOP కృష్ణ, DC లు గీతారాధిక, ముకుందరెడ్డి, ఉమాశంకర్, EE లు ఇందిరాబాయి, శివానంద్, శ్రీనివాస్, వాటర్ వర్స్క్ GM లు వినోద్, రమణారెడ్డి, సంతోష్, ఎలెక్ట్రికల్ DE వెంకన్న, MRO లు హసీనా, జానకి తదితరులు ఉన్నారు.

Related posts

భూ వివాదంలో దాడికి గురైన దళితుల్ని పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకెళ్లారు?

Satyam NEWS

మోడీ వారణాసి ఎన్నికపై కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు

Satyam NEWS

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే కేసీఆర్ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment