42.2 C
Hyderabad
April 26, 2024 16: 41 PM
Slider నల్గొండ

రక్తదానం తో ప్రాణాలు కాపాడిన జనచైతన్య ట్రస్ట్

#blooddonation

ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుదామని పార సాయి నాయుడు అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఓ ప్రైవేట్ వైద్యశాలలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి మహిళ డాక్టర్ తగు పరీక్షలు చేసి రక్తం తక్కువ ఉన్నదని చెప్పటంతో బాధితులు జనచైతన్య ట్రస్ట్ చైర్మన్ సాయి నాయుడు కి సమాచారం అందివ్వటంతో తక్షణమే స్పందించి పార సాయి నాయుడు వైద్యశాలకు వెళ్లి విషయం తెలుసుకొని ‘ఓ’            పాజిటివ్ రక్తం ఇచ్చి పునర్జీవం ఇచ్చారు.

ఈ సందర్భంగా జనచైతన్య ట్రస్ట్ చైర్మన్ సాయి నాయుడు మాట్లాడుతూ రక్త దానం అనేది చాల పవిత్రమైనదని,రక్తాన్ని మానవులు సృష్టించలేరని,దానం మాత్రమే చేయగలరని,ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు సంవత్సరానికి రెండు లేదా మూడు మార్లు రక్త దానం చేయొచ్చని, రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టవచ్చని అన్నారు.తాను సకాలంలో రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు.

డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సాయి నాయుడు ను ఆదర్శంగా తీసుకుని ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణం పోయాలని,ఈ స్ఫూర్తిని ఇలానే కొనసాగించాలని కోరారు.రక్తదానానికి కులం,మతం లేదని,మానవ సేవే మాధవ సేవగా భావించాలని అన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

త్వరలో విడుదలకు సిద్ధమైన క్రేజీ అంకుల్స్

Satyam NEWS

భద్రాచలం ప్రసాదం రేట్లు పెంపు

Satyam NEWS

శిథిలావస్థకు చేరుకున్న నరసరావుపేట షాదీ ఖానా

Satyam NEWS

Leave a Comment