42.2 C
Hyderabad
May 3, 2024 16: 44 PM
Slider ముఖ్యంశాలు

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేo

Hardeep Singh Puri

ఇప్పట్లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేదని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తేల్చి చెప్పారు.ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశాలు తక్కువ అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి

హర్దీప్ సింగ్ చెప్పారు. గతేడాది ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగిస్తున్నదని గుర్తు చేశారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే పరిస్థితిలో తాను లేనని, వేచి చూడాల్సిందేనని చెప్పారు. గత

త్రైమాసికంలో కేంద్ర చమురు సంస్థలు పుంజుకున్నాయని హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరంగా ఉంటే, వచ్చే త్రైమాసికంలో చమురు సంస్థలకు మంచిదన్నారు. కేంద్ర చమురు సంస్థలు

నష్టాల నుంచి రికవరీ సాధించాయని, ఇది మంచి పరిణామం అని అన్నారు. లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా శనివారం రూ.100 మార్కు పైనే ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, కోల్ కతాలో రూ.106.03, ముంబైలో రూ.106.31, చెన్నైలో రూ.102.80 పలుకుతున్నది.

Related posts

చరిత్ర ను తుంగలోని నెట్టేస్తోందీ జగన్ ప్రభుత్వం..

Satyam NEWS

మేడారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర

Satyam NEWS

ఢిల్లీ ఎయిమ్స్ లో కొత్త ఫంగస్ వ్యాధి.. ఇద్దరి మరణం

Sub Editor

Leave a Comment