39.2 C
Hyderabad
May 3, 2024 11: 11 AM
Slider కడప

రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఓదార్చాలి

Bhatyala TDP

కడప జిల్లాలో అరటి, దోస, కర్భుజ రైతులు పండించిన పంటను అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోయారని రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు అన్నారు. రైతులు ఎకరానికి కనీసంగా లక్ష రూపాయలు నష్ట పోయారని అన్నారు. నేడు ఆయన మీడియా ప్రకటన విడుదల చేసారు.

పండిన పంట చేలోనే పండిపోయి నాశనం మవుతుంటే రైతుల్ని పట్టించుకునే వారే లేరని ఆయన తెలిపారు. తక్షణం ప్రభుత్వం పట్టించుకొని పంట నష్టం చెల్లించాలని కోరారు. రైతుల ఆక్రందనలు వినేదానికి అధికార బృందాన్ని పంపించి సర్వే చేయవలసిందిగా కోరారు.

అదేవిధంగా ఇటీవల అకాల వర్షాలకు అరటి పంట నష్టపోయిన మునక్కాయపల్లి, పెద్దకారం పల్లి, ఆకేపాడు, మిట్టమీదపల్లి, కొల్లవారిపల్లి, శవనవారి పల్లి, మేకవారిపల్లి, గొందివారిపల్లి, వత్తలూరు, అనంతయ్యగారిపల్లి తదితర గ్రామాల్లో ఇంత వరకు కూడా సర్వే జరగలేదని ఆయన అన్నారు. సర్వే జరిపించి నష్టపరిహారం చెల్లించ వలసిందిగా కోరారు. కరోనా బాధలో ఉన్నవారికి దెబ్బమీద దెబ్బ పడిందని, దయచేసి రైతాంగాన్ని అదుకోవాలని, ఎకరాకు పెట్టుబడే లక్ష రూపాయలు కాగా, వారు చూస్తుండగానే పంట మాగి చెడిపోయిందని, వారిని ఓదార్చ వలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు.

Related posts

వలస కార్మికుల్ని కాల్చి చంపిన ఉగ్రవాదులు

Satyam NEWS

రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవద్దు

Satyam NEWS

వాలంటీర్ చేసిన హత్య … ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యే

Satyam NEWS

Leave a Comment