29.7 C
Hyderabad
April 29, 2024 08: 06 AM
Slider నల్గొండ

రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవద్దు

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో  వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద  వానాకాలం పంట కొనుగోలు కేంద్రాన్ని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి  మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో పండే పంటలు ఎంతో  నాణ్యతతో ఉంటాయని, మన పంటలకు మార్కెట్లో అధిక ధరలు లభిస్తాయని, రైతులు ఎవరు  అధైర్య పడి తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ము కోవాల్సిన అవసరం లేదని అన్నారు. 

కొంతమంది రైతులను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు  ప్రచారం చేస్తూ  రైతులు ధైర్యాన్ని కోల్పోయే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండి ధైర్యంగా వారి పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసే కేంద్రాలలో అమ్ముకోవాలని అన్నారు.

ప్రభుత్వం కొనుగోలు కొరకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్ అండ్ ఆర్ 52 0 4 అలాగే 1010 వీటిని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని దానివలన మన ప్రాంతంలో రైతులు సాగుచేసిన ప్రైవేట్ సీడ్స్ పూజ, హెచ్ఎంటి,చింట్లు పండించిన రైతులు నష్టపోతున్నారని భావించి  వాటిని కూడా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందే విధంగా కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సోమవారం నుండి అన్ని రకాల వ్యవసాయ సహకార సంఘం ద్వారా అలాగే గ్రామాలలో ఐకేపీ ద్వారా కొనుగోలు చేస్తారని   అన్నారు. రైతులందరూ వారి యొక్క ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టుకొని ఎగ పోసుకొని శుభ్రం చేసుకొని తీసుకొని  ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలన్నారు.

అదే విధంగా రైతుబంధు తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రైతులందరూ రైతు పక్షపాత ప్రభుత్వం చేస్తున్న రైతు సేవా కార్యక్రమాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందాలని కోరారు.

Related posts

పార్టీ తుడిచిపెట్టుకుపోయినా మేం పదవి వదలం

Satyam NEWS

హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం సిఫార్సు

Murali Krishna

మట్టి మిద్దె కూలిపోయి ముగ్గురు మృతి

Satyam NEWS

Leave a Comment