31.7 C
Hyderabad
May 7, 2024 01: 14 AM
Slider వరంగల్

హేతుబద్ధీకరణ పేరుతో స్కూళ్ల మూసివేత తగదు

#govt schools

హేతుబద్దీకరణ (రేషనలైజేషన్) పేరుతో పాఠశాలలు మూసివేయడం సరికాదని ఎస్టియు(STU) ములుగు జిల్లా అధ్యక్షుడు ఏళ్ళ మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు.  రేషనలైజేషన్ ప్రక్రి యతో పాఠశాలలను మూసివేయాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.  కొవిడ్ కారణంతో పాఠశాలలు నడవడం లేదని, అదే విధంగా కోవిడ్ కారణంగా విద్యార్థుల నమోదు పూర్తి స్థాయిలో లేదని ఆయన అన్నారు. వీటన్నింటితో బాటు నూతన జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల క్యాడర్ విభజన ఒక కొలిక్కి రాలేదని, ఇంతటి అయోమయ పరిస్థితుల్లో హడావుడిగా ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం విద్యాశాఖకు ఏమొచ్చిందని  అని ఆయన ప్రశ్నించారు. పాఠశాలలో ప్రత్యక్ష తరగతులు  పూర్తి స్థాయిలో ప్రారంభమైన ఆరు నెలల తర్వాత   విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 2021-22 విద్యా సంవత్సరం ప్రకారం విద్యార్థుల సంఖ్య ను అనుసరించి హేతుబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో నెంబర్ 25 లో  పేర్కొన్న కాలం చెల్లిన పాత కాలం నాటి నిబంధనలను సవరించాలని డిమాండ్ చేశారు.

Related posts

టాస్క్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్ బిట్టూ మృతి

Satyam NEWS

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : పోచారం

Satyam NEWS

రామోజీరావు ఏం చేయబోతున్నారో?

Satyam NEWS

Leave a Comment