42.2 C
Hyderabad
April 26, 2024 18: 47 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ పట్టణ ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

#hujurnagar congress

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్వర్గీయ భారత  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి,మిఠాయిలు పంచిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు, పిసిసి జాయింట్ సెక్రటరీ ఎం డి.అజీజ్ పాషా, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర నాయకుడు యరగాని నాగన్న గౌడ్, తదితర ముఖ్య నాయకులు మాట్లాడుతూ 40 సంవత్సరాల అతి పిన్న వయసులో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు.

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని వారు అన్నారు. ఐటి రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీ కే దక్కిందని వారు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎనలేని కృషి చేశారని,ప్రభుత్వ సహాయంతో దేశవ్యాప్తంగా గ్రామీణ,పట్టణ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్​ల శ్రేణిని నిర్మించి,ఫోన్‌‌లను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని అన్నారు. ముఖ్యంగా మహిళలు,షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కొత్త నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ను ప్రవేశపెట్టిందని తెలిపారు. కంప్యూటర్ రంగాన్ని మ‌‌న దేశానికి పరిచయం చేసి ఎంతో మంది విద్యార్థులు సాంకేతిక విద్యను నేర్చుకునేలా చేసింది రాజీవ్ గాంధీనే అని ప్రధానమంత్రిగా భారత దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.

అనంతరం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ఏరియా వైద్యశాలలో  రోగులకు పాలు,పండ్లు,బ్రెడ్లు  అందించారు.

ఈ కార్యక్రమంలో  రాష్ట్ర, జిల్లా, మండల, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మాజీ జడ్పీటీసీ గల్లా వెంకటేశ్వర్లు,పట్టణ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య,నాయకులు బాచిమంచి గిరిబాబు,ముశం సత్యనారాయణ, మేళ్లచెరువు ముక్కంటి,పి.రామ్మూర్తి, నందిగామ శ్రీను,ఇట్టిమల్ల బెంజిమెన్,కోల మట్టయ్య, కస్తాల రవీందర్,రెడిపాంగు రాము,కోడి మల్లయ్య,సుదర్శన్,తెప్పని యలమంద,సంక్రాంతి కోటేశ్వరరావు, కంకణాల పుల్లయ్య,సప్పిడి సావిత్రి,గడ్డం వెంకటమ్మ, కస్తాల ముత్తయ్య,కోళ్లపూడి డేవిడ్,అజ్మతుల్లా,కొబ్బెర వెంకన్న, పాలకూరి లాలు,వేముల ఆనంద్,యూత్ కాంగ్రెస్ నాయకులు తెల్లబోయిన శ్రీనివాస్,పులి బాలకృష్ణ ,పులి  లోకేష్, గోపాల్ దాస్,కందుల వినయ్,లక్కీ, అభినవ్ కృష్ణ, హర్ష తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

అత్యవసర చికిత్సపై అరుణ్ జైట్లీ

Satyam NEWS

అర్థరాత్రి రోడ్డుపై సరస్వతీ పుత్రులు.. ఏ క్షణాన్నైనా అరెస్ట్..!

Satyam NEWS

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విజయవంతంగా చలివేంద్రం

Satyam NEWS

Leave a Comment