21.7 C
Hyderabad
November 9, 2024 06: 58 AM
Slider ప్రత్యేకం ముఖ్యంశాలు

రామోజీరావు ఏం చేయబోతున్నారో?

papers

తెలుగు పత్రికా రంగంలో సంచలనం తెచ్చిన ఈనాడు కు ఏమైంది? ఏమైంది బాగానే ఉంది కదా అని అడగవచ్చు. ఇప్పుడు బాగానే ఉంది. కానీ రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నది? అందులో పని చేసే సిబ్బంది పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలు గత రెండు రోజులుగా ఈనాడు పత్రిక చూస్తే తలెత్తుతున్నాయి. వాస్తవానికి శ్రావణ మాసం పండుగ సీజన్ మరిన్ని ఎక్కువ పేజీలు వేసి మరిన్ని ఎక్కువ ప్రకటనలు తెచ్చుకోవాల్సిన సమయం. అలాంటిది ఈ సమయంలో ఈనాడు పేజీలు కుదించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. 20 పేజీలున్నమినీ ఈనాడు  టాబ్లాయిడ్ ఎడిషన్ 16 పేజీలకు కుదించింది. అదే విధంగా మెయిన్ పత్రికను 16 పేజీలకు కుదించింది. కొన్ని జిల్లాల్లో 16పేజీలున్న మినీ ని 12 పేజీలకు తగ్గించింది. పేజీలు తగ్గిస్తే ముందుగా ప్రమాదం ముంచుకొచ్చేది సబ్ ఎడిటర్లకు, ఆ తర్వాత రిపోర్టర్లకు మిగితా సిబ్బందికి. ఇప్పటి వరకూ వారి ఉద్యోగాలకు ఎలాంటి ప్రమాదఘంటికలు మోగలేదు కానీ పేజీలు తగ్గిపోయి ఇలాగే కొనసాగితే మాత్రం సిబ్బందిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసినట్లుగా భావించవచ్చు. దీనివల్ల ఒక్కో డెస్కు నుంచి ఇద్దరు ముగ్గురు సబ్ ఎడిటర్లను తొలగించే ప్రమాదముంది. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలనే ఉద్దేశంతో ఒకపేజీతోనే జోన్ ను కూడా కొనసాగించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. సంతృప్తికర వేతనాలు చెల్లించే ఈనాడు పత్రికే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అరకొర జీతాలిచ్చే సాక్షి, ఆంధ్రజ్యోతి ఇంకెలాంటి మార్పులు చేర్పులు చేస్తాయో తెలియక సిబ్బంది సైతం ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే ఆంధ్రజ్యోతి సిబ్బందిని తొలగిస్తూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారం వచ్చాక సాక్షి కూడా కొందరు  సిబ్బందిని పొమ్మనలేక పొగ పెడుతున్నది. ఏదేమైనా సరైన వేతనాలు లేకపోయినా ఇప్పటివరకూ ముక్కుతూ మూల్గుతూ  నెట్టుకొచ్చిన రిపొర్టర్లు, సబ్ ఎడిటర్ల ఉద్యోగాలు మరింత ప్రమాదంలో పడుతున్నాయి. ఇప్పటికే విజయక్రాంతి లాంటి పత్రికలు అర్ధంతరంగా మూసేసి సిబ్బందిని రోడ్డు పడేశాయి.

Related posts

షెడ్డు పనులను పరిశీలించిన ఎంపీడీవో

Satyam NEWS

రేవా రిసార్ట్స్ వ్యవహారంపై నారా లోకేష్ సీరియస్

Satyam NEWS

శ్రీశ్రీశ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవంలో పోలీసు సేవా దళ్ సేవలు భేష్

Satyam NEWS

Leave a Comment