27.7 C
Hyderabad
May 15, 2024 06: 19 AM
Slider నల్గొండ

నిరంకుశ విధానాలపై ఐక్యంగా పోరాడుదాం రండి కదలి రండి

#citu

భారతదేశాన్ని కాపాడుదాం, ప్రజలను రక్షించుకుందాం అన్న నినాదంతో జరుగుతున్న మార్చి 28, 29 రెండు రోజుల సమ్మెను విజయవంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య,టిఆర్ఎస్ కె వి నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కి మంగళవారం సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం కార్మిక సంఘాల రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ నేతలు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్ ల చట్టాలతో బానిసలుగా,కట్టు బానిసలుగా ఉద్యోగ, కార్మికుల పరిస్థితుల ఉంటాయని,బిజెపి ప్రభుత్వం కార్మిక,ఉద్యోగ,రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని తీవ్రంగా ఆరోపించారు.28వ,తేదీన మున్సిపల్, పట్టణాలలో,మండల కేంద్రాలలో ప్రదర్శన చేయాలని,29వ, తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు తెలియ చేయాలని కోరారు.

హక్కులు లేకుండా చేసే చర్య

కాంట్రాక్ట్,అవుట్సోర్సింగ్,ఫిక్సుడ్ టర్మ్, డైలీ వేజ్ తదితర పేర్లతో ఉపాధి పొందుతున్న కార్మికుల శ్రమను దోచుకునేందుకే లేబర్ కోడ్ లను కేంద్రం ప్రభుత్వం తీసుకొస్తుందని అన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టకపోతే మున్సిపల్,గ్రామ పంచాయతీ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు లేకుండా పోతాయని అన్నారు.

నాలుగు కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 5 కనీస వేతనాల జీవోను అమలు చేయాలని,కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని,ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నిధులు కేటాయింపు పెంచాలని,ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలలో కూడా అమలు చేయాలని,దేశంలోని అత్యధిక ధనవంతుల(కార్పొరేటు వర్గాలు) ఆదాయంపై సంపద టాక్స్ పెంచి విద్య, ఆరోగ్యం,వ్యవసాయ రంగాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

సమాన పనికి సమాన వేతం

పెట్రోల్,డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని,ప్రజా పంపిణీ ద్వారా నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకే పంపిణీ చేయాలని,భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,కార్మికులందరికీ డబుల్ బెడ్ రూములు కల్పించాలని, గ్రామపంచాయతీ కార్మికులకు నష్టదాయకమైన జిఓ నెం.51ని సవరించాలని,మల్టీపర్పస్ వర్క్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి 2022 మార్చి 9న,అసెంబ్లీలో కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తానని ప్రకటించిన విధంగా మున్సిపల్,గ్రామ పంచాయతీల లోని కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్ చేయాలని కోరారు.మున్సిపల్ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఎన్ ఎమ్ ఆర్,ఫుల్ టైం,డైలీ వేజ్,ఇతర రకాల కార్మికులకు కూడా జిఓ నెంబర్ 60లో పేర్కొన్న విధముగా వేతనాలు అమలు చేయాలని అన్నారు.టాక్స్ పరిధిలో లేని అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 7,500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మున్సిపల్ కార్మికులు లాక్ డౌన్ కరోనా సమయంలో పనిచేస్తున్నా పర్మినెంట్ ఉద్యోగులుగా ప్రకటించక పోవడం తీవ్ర అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు ఆకుల నరసింహారావు,మేరిగ దుర్గారావ్,కస్తాల సైదులు,చంటి,లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కాలువ నిర్మాణంపై కాంగ్రెస్ ఆందోళ‌న‌

Sub Editor

గుడ్ న్యూస్: ఏపీలో‌ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

Satyam NEWS

కాటేసిన క‌రోనా… ట్రాఫిక్ పీసీ భార్య అకాల‌మృతి…

Satyam NEWS

Leave a Comment