35.2 C
Hyderabad
May 9, 2024 16: 18 PM
Slider పశ్చిమగోదావరి

అక్రమంగా తరలిపోతున్న పోలవరం కాలువ గట్టు మట్టి

#polavaramcanal

ఏలూరు డివిజన్ పరిధి లో ఉన్న పోలవరం కాలువ పై లష్కర్ ల పర్యవేక్షణ లేకపోవడతోనే రాత్రి సమయాలలో కాలువ గట్టు మట్టి అక్రమంగా తరలిపోతుందని పోలవరం కాలువ పరివాహక ప్రాంతాల ప్రజలు తెలుపుతున్నారు.  మట్టి పుష్కలంగా ఉన్న కాలువ గట్లను పరి రక్షించాల్సిన అధికారులే కొన్ని వేల క్యూబిక్ మీటర్ల వరకు అధికార అనుమతులు, మరికొన్ని వేల క్యూబిక్ మీటర్ల మట్టికి అనధికార అనుమతులివ్వడం వల్ల కొంత మంది కాంట్రాక్టర్ లు రాత్రి సమయాలలో యథేచ్ఛగా మట్టిని తరలించుకుపోయి ప్రభుత్వానికి అధికార అనుమతుల ద్వారా రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయం అనధికార అనుమతులిచ్చిన అధికారుల జేబుల్లోకి కొంత కాంట్రాక్టర్ల జేబుల్లోకి కొంత చేరుతుందని   కొంత మంది కింది స్థాయి అధికారులే చాటు మాటుగా చెప్పుకుంటున్నట్టు సమాచారం.

గతం లో స బ్ డివిజన్ ల పరిధిలో కిలోమీటర్ కొక లష్కర్  పనిచేసే వారని ప్రస్తుతం ప్రభుత్వం లష్కర్ లకు వేతనాలు కూడా ఇవ్వక పోవడం తో కొంతమంది జె ఈ లే లష్కర్ ల గానూ .అటెండర్ ల గానూ అవతారమెత్తి విధులు నిర్వహించాల్సి వస్తుందని కింది స్థాయి ఇంజినీర్లు  ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఒక్కొక్క సారి పై స్థాయి అధికారులు చేసిన కొన్ని అవినీతి అక్రమాల పనుల పై ఉన్నతాధికారులకు పాల్స్ రిపోర్ట్ లు కూడా మాతోనే రాయించి  వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల నుండి బయటపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం .

నిజంగా అధికారులు పోలవరం గట్టు  మట్టి తవ్వకాలకు ఇచ్చిన అధికార అనధికార అనుమతుల పైన .కాంట్రాక్టర్ లు తరలించుకుపోయిన వేలకు వేలు క్యూబిక్ మీటర్ ల మట్టి అక్రమంగా తరలిపోయిన పరిస్థితి పరిశీలిస్తే అనే ఆందోళన అధికారులను వెంటాడుతున్నట్టు సమాచారం. ఉదాహరణకు ఒక కాంట్రాక్టర్ కు 10 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపుకు ఇచ్చిన అనుమతి ముసుగులో మరో 10 వేల క్యూబిక్ మీటర్ల మట్టి ని అదనంగా కాంట్రాక్టర్ లు తరలించుకు పోతున్నారని కొన్ని  సబ్ డివిజన్ లలో పనిచేసే సిబ్బంది గుస గుస లాడుకుంటున్నట్టు సమాచారం.

మట్టి తరలించుకోవడానికి అనుమతి కొరకు దరఖాస్తు చేసుకునే కాంట్రాక్టర్ కి అధికారికి మధ్య కుదిరిన  ఇల్లీగల్    ఒప్పందాల పై అనుమతి ఇచ్చే   అధికారి సంతృప్తి చెందితే అనధికారికంగా మరో 10 వేల క్యూబిక్ మీటర్ల మట్టి ఉచితంగా తరలించుకుపోవడానికి అధికారులు చూసీ చూడనట్టు గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమాల ను కూడా సక్రమమే నని కింది స్థాయి ఇంజనీర్లతో పాల్స్ రిపోర్ట్ లు తయారు చేయిస్తున్నట్ట భోగట్టా. ఇటువంటి అక్రమాల పై స్టేట్ మరియు సెంట్రల్ విజిలెన్స్ అండ్ ఎన్ పోర్స్ మెంట్ బృందం పోలవరం గట్టు మట్టి అక్రమ తవ్వకాల పై కొలతలు వేసి అధికారులు అధికారికంగా ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి కి అనుమతులిచ్చారు.

అనధికారంగా  కాంట్రాక్టర్ లు తరలించుకుపోయింది ఎన్ని క్యూబిక్ మీటర్లు అనే దాని పై పూర్తి స్థాయి విచారణ జరిపితే పోలవరం గట్టు మట్టి లో జరిగిన అవినీతి అక్రమాలు కట్టలు తెంచుకుని బట్టబయలౌతాయని అప్పుడు ఎవరు బలౌతారో తెలియదని కింది స్థాయి ఉద్యోగుల్లో గుబులు రేగుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా పెదవేగి.దెందులూరు  ద్వారాకా తిరుమల నల్లజర్ల మండలాల పరిధిలో పోలవరం కాలువ పరివాహక   గ్రామాల పరిధిలో ఉన్న పోవలరం కుడి కాలువ పై లష్కర్ ల పర్యవేక్షణ ఉంటే అనధికారికం గా తరలిపోయే మట్టిని ఎంతో కొంత పరిరక్షించే వారని ప్రజలు అనుకుంటున్నారు.

Related posts

బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై రాజ‌మ‌న్నార్ అలంకారంలో శ్రీ‌ మలయప్ప

Satyam NEWS

కేజీబీవీ ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దు

Satyam NEWS

Leave a Comment