42.2 C
Hyderabad
May 3, 2024 17: 20 PM
Slider ముఖ్యంశాలు

పోలవరం పూర్తి కావడం కష్టo

#polavaram

నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై రాజ్యసభలో వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు సమాధానం ఇచ్చారు. పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతోందా అని వైకాపా ఎంపీ ప్రశ్నించగా షెడ్యూల్‌ ప్రకారం 2024 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. కానీ, వివిధ కారణాల దృష్ట్యా ఈ గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమని స్పష్టం చేశారు. చెల్లించాల్సిన బ్యాలెన్స్ రూ. 2,441.86 కోట్లు మాత్రమేనని, ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2019 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రూ.6,461.88 కోట్లు ఏపీ ప్రభుత్వానికి విడుదల చేసిందన్నారు.  2013-14 అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయం రూ. 29,027.95 కోట్లు. 2017-18 అంచనాల ప్రకారం రూ. 47,725.74 కోట్లకు పెరిగిందని,  2016లో కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం మేరకు 100 శాతం ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులను కేంద్రం తిరిగి చెల్లిస్తుందని,  ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ. 15,667.90 కోట్లు కాగా, అందులో ఇప్పటికే రూ. 13,226.04 కోట్లు ఏపీ ప్రభుత్వానికి చెల్లించాం అన్నారు.  చెల్లించాల్సిన బ్యాలెన్స్ రూ. 2,441.86 కోట్లు మాత్రమే అని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Related posts

హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టం

Satyam NEWS

ఎకరాకు రూ. 20 వేలు పరిహారం ఇవ్వాలి

Murali Krishna

పాలమూరుకు అన్యాయం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment