29.7 C
Hyderabad
April 29, 2024 08: 22 AM
Slider ముఖ్యంశాలు

ప్రత్యేక హోదా లేనే లేదు

#parliament

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ప్రసుత్తం ఉనికిలోనే లేదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో వైకాపా ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ”వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించింది. జనరల్ కేటగిరి రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి సంబంధించి 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం చూపలేదు. ప్రణాళిక, ప్రణాళికేతర కింద రాష్ట్రాల అవసరాల మేరకు నిధులు బదలాయించేందుకు 14వ ఆర్థిక సంఘం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే 2015-20 మధ్య రాష్ట్రాలకు పంచే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42శాతానికి కేంద్రం పెంచింది. దీనికి కొనసాగింపుగా 15వ ఆర్థిక సంఘం కూడా 41శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసింది. నిధుల పంపిణీ ద్వారా వీలైనంత మేరకు ప్రతి రాష్ట్రానికి వనరులు అందించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది. నిధుల పంపిణీ తరువాత కూడా వనరుల లోటు ఉండే రాష్ట్రాలకు.. రెవెన్యూ లోటు పూడ్చేందుకు గ్రాంట్స్ అందిస్తోంది” అని కేంద్ర మంత్రి వివరించారు.

Related posts

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు లాభనష్టాలు కొలమానం కాదు

Satyam NEWS

తుపాకీతో కాల్చుకుని ఆర్.పి.ఎస్.ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Satyam NEWS

తనిఖీల్లో వలంటీర్ హాజరు శాతంపై మండిపడ్డ కలెక్టర్..

Satyam NEWS

Leave a Comment