27.7 C
Hyderabad
May 4, 2024 10: 11 AM
Slider గుంటూరు

జగన్ రెడ్డి అక్రమాలను ప్రశ్నించినందుకే నరేంద్ర అరెస్టు

#chadalawada

జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నఅవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తున్నందుకే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల  నరేంద్ర ను అరెస్ట్ చేశారని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు.

నేరం ఏమిటో కూడా తెలియకుండా అరెస్టు చేయడం దారుణమని ఆయన అన్నారు. రాజకీయ జీవితంలో మచ్చలేని ధూళిపాళ్ల నరేంద్రను ఏదో ఒక విధంగా జైలుపాలు చేయాలని కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన అన్నారు.

సంగం డెయిరీలోని ప్రతి ఇష్యూ హైకోర్టు, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నించారు.

రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే నరేంద్రను అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు.

Related posts

మొబైల్ పోయిందనే ఆందోళన వదిలేయండి

Satyam NEWS

వివేక హత్య సాక్ష్యాలను మాయం చేసింది అవినాష్ రెడ్డే

Satyam NEWS

ఫ్యాక్ట్ ఫైండింగ్:చంద్రబాబు మనుషుల ఇన్ సైడ్ ట్రేడింగ్

Satyam NEWS

Leave a Comment