39.2 C
Hyderabad
May 3, 2024 11: 03 AM
Slider వరంగల్

మొబైల్ పోయిందనే ఆందోళన వదిలేయండి

#mulugusp

పోగొట్టుకున్న లేదా దొంగిలించబడ్డ మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేసే కొత్త విధానం  సి. ఈ. ఐ. ఆర్ సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ములుగు  జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. (సిఇఐఆర్) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ పోగొట్టుకున్న/ దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేయడంలో సహాయపడుతుందని అన్నారు.

ప్రస్తుత జీవన శైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలక పరికరం అయ్యిందని, ఏదైనా సమాచారంతెలుసుకోవాలన్నా, నగదు లావాదేవీలు చేయాలన్నా మొబైల్ ఫోన్ పైనే ఆధారపడేంతగా ప్రాధాన్యం సంతరించుకున్న మొబైల్ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్న /చోరికి గురైతే పరిస్తితి ఎలాఉంటుందో ఊహించనవసరం కష్టమేనని అన్నారు. 

పోయిన ఫోన్ లను వెతికి పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందని అయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ CEIR అనే అప్లికేషన్  ద్వారా చరవాణి( సెల్ ఫోన్ ) ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరికి గురైనా ఆ చరవాణి వెతికి పట్టుకోవడానికి CEIR పోర్టల్ దోహదపడుతుందని అన్నారు. కేంద్ర  టెలికాం మంత్రిత్వ శాఖ “సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ  రిజిస్టర్” (సీఈఐఆర్ ) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం www.ceir.gov.in  అనే వెబ్సైట్లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్ / స్టోలెన్  మొబైల్ లింక్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయాలి. పోయిన చరవాణిలోని నెంబర్లు, ఐఎంఈఐ నెంబర్లు, కంపెనీ పేరు, మోడల్,  కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి.

మొబైల్  ఏ రోజు, ఎక్కడ పోయింది, జిల్లా, రాష్ట్రం, పోలీస్ స్టేషన్ పరిధి,  ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి, చివరగా వినియోగదారుడు పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడి, ఓటిపి కోసం మరో మొబైల్ నెంబరు ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడి నెంబర్ వస్తుంది,  ఈ ఐడి ఆధారంగా  దర్యాప్తు   ప్రక్రియతో పాటు మొబైల్ దొరికిన వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్ ఏ కంపెనీదైనా సీఈఐఆర్ విధానం దాని పని చేయకుండా చేస్తుంది.

దాంతో పాటు కేసు చేదనలో పోలీసులకు ఉపయోగపడుతుంది. మొబైల్ దొరికిన తర్వాత  వినియోగదారుడు  అదే వెబ్సైట్ లోకి వెళ్లి అన్ బ్లాక్/  ఫౌండ్ మొబైల్  లింకు పై క్లిక్ చేయాలి ,తర్వాత ఐడి నమోదు చేయగానే అన్ బ్లాక్ అవుతుంది. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఆ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలి, IMEI ఆధారంగా దర్యాప్తు చేస్తారు కేంద్రం ప్రవేశపెట్టిన సి ఈ ఐ ఆర్ వెబ్సైట్లో పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తే.. త్వరగా మొబైల్ ఫోన్ దొరకడానికి అవకాశం ఉంటుంది.

Related posts

కేర్ ఫుల్: పతంగులు ఎగరవేస్తున్నారా జాగ్రత్త!

Satyam NEWS

కోర్టును ధిక్కరించడం హీరోయిజం అనిపించుకోదు

Satyam NEWS

ఇదేం రాజీనామా? ఇంత నాటకాలు ఎందుకు గంటా?

Satyam NEWS

Leave a Comment