29.7 C
Hyderabad
April 29, 2024 10: 30 AM
Slider ప్రత్యేకం

ఫ్యాక్ట్ ఫైండింగ్:చంద్రబాబు మనుషుల ఇన్ సైడ్ ట్రేడింగ్

sub comittee

చంద్రబాబునాయుడి హయాంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఇంత కాలం చెబుతున్న మంత్రులు ఇప్పుడు ఆధారాలతో సహా సేకరించారు. వాటిని నివేదిక రూపంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అప్పగించారు. చంద్రబాబు, టీడీపీ నేతల రాజధాని లో భూ కుంభకోణానికి పాల్పడ్డారని మంత్రుల ఉప సంఘం తేల్చింది.

వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించింది. టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ తో భూములు కొనుగోలు చేసినట్లు సబ్ కమిటీ నిర్ధారణ చేసింది. 4,075 ఎకరాల భూములను టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు నివేదిక వెల్లడించింది.

చంద్రబాబు హెరిటేజ్ సంస్థ, లింగమనేని, వేమూరి హరిప్రసాద్ ల భారీ భూ కొనుగోళ్ల వివరాలతో సహా నివేదిక సమర్పించారు. అప్పటి మంత్రులు పుల్లారావు, నారాయణ, పరిటాల సునీతతో సహా టీడీపీ నేతలు భూ మాయ కు పాల్పడ్డారని సబ్ కమిటీ బట్టబయలు చేసింది. సీఆర్డీఏ పరిధిని ఇన్ సైడర్ ట్రేడింగ్ కోసం పలుమార్లు మార్చినట్లు ఆధారాలు కూడా గుర్తించింది.

ఎస్సీ, ఎస్టీ నుంచి 900 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు సబ్ కమిటీ నివేదికలో వెల్లడించారు. తెల్లరేషన్ కార్డుదారులు కూడా కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసినట్లు నివేదికలో వెల్లడిచారు.  హైదరాబాద్ లోని తెల్లరేషన్ కార్డుదారులు కూడా అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు నివేదికలో వెల్లడించారు.

Related posts

కరోనా ఎఫెక్ట్: కామారెడ్డిలో స్వచ్ఛందంగా లాక్ డౌన్

Satyam NEWS

మార్చి 26 నుండి విజయవాడ టూ షిర్డీ విమానం

Murali Krishna

ప్రొటెస్టు డే: రేవంత్ అరెస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

Satyam NEWS

Leave a Comment