29.7 C
Hyderabad
May 2, 2024 05: 42 AM
Slider తెలంగాణ

జింకను వేటాడి.. మాంసం విక్రయించే గ్యాంగ్ అరెస్ట్

police hyderabad

కృష్ణజింకను వేటాడిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నల్లమల అడవుల్లో జీవించే కృష్ణజింకలను కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా వేటాడి ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటున్నారని ఆయన తెలిపారు. రాత్రి సమయంలో సీక్రెట్ గా ఈ టీమ్ కృష్ణజింకలను వేటాడుతున్నాయని తెలిపారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అన్వర్(58), మహ్మద్ జావేద్(20)ను అదేవిధంగా వనపర్తికి చెందిన చాపల సైదయ్య(32) అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వనపర్తి జిల్లా పేబ్బేరుకు చెందిన మత్స్యకారుడు సైదయ్యతో వీరికి పరిచయం ఏర్పడింది. ఇతను కూడా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వేటకు వెళ్లి రకరకాల పక్షులను పట్టుకొచ్చేవాడు. వాటిని విక్రయించే నిమిత్తం నగరంలోని ముర్గీ చౌక్‌కి తీసుకువచ్చి అన్వర్, జావేద్‌లకు విక్రయించేవాడు.  కొన్ని రోజులక్రితం సైదయ్య వేటకు వెళ్లి కృష్ణ జింకను పట్టుకున్నాడు. దీన్ని అమ్మేందుకు అన్వర్, జావేద్‌లకు ఇచ్చాడు. అవసరమైన వినియోగదారులకు కిలో రూ. 3 వేల చొప్పున వీరు జింక మాంసం అమ్ముతుండేవారు. జింక సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి నిందితులను పట్టుకున్నారు. అడిషినల్ డీసీపీ, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సహాకారంతో ఈ ఆపరేషన్ సాగిందని తెలిపారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు సీపీ అంజనీ కుమార్. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 10 నెలలు ఉన్న కృష్ణజింకుకు పాలు పట్టించారు. అడజింకగా గుర్తించారు. కృష్ణజింకను ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులకు అప్పగించారు.

Related posts

డిస్నీ+ హాట్‌స్టార్ లో ప్రసారం కానున్న ‘ఆర్ యా పార్’

Bhavani

జాతీయ క్రీడలకు విజయ్ హైస్కూల్ విద్యార్ధులు

Satyam NEWS

రంజాన్ ప్రార్ధనలకు ముస్లింలు బయటకు రావద్దు

Satyam NEWS

Leave a Comment