37.2 C
Hyderabad
May 6, 2024 12: 48 PM
Slider ప్రత్యేకం

అధికార పార్టీ ధర్నా చేస్తే ఓకే… నిర్వాసితులు ధర్నా చేస్తే ఊరుకోం

#jagadeshwararo

అధికార పార్టీకి చెందిన నాయకులు ధర్నా చేస్తుంటే అనుమతులు ఇచ్చి చోద్యం చూసిన పోలీసులు భూనిర్వాసితులు ధర్నా చేస్తుంటే మాత్రం పైశాచికంగా అరెస్టు చేస్తున్నారు. రైతులకు అండగా ఉంటామని సోమవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం చూశాం.

మరోపక్క పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన ఏల్లూరు గ్రామ  రైతులు నిరసన చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చి  రైతులను అక్రమ అరెస్టులు చేసి బంధించారు. ఏల్లూరు గ్రామంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భూములను కోల్పోయిన రైతులకు ఎకరానికి 1,70,000/-ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలని ప్రభుత్వం నిర్ణయించడంతో  వాటిని రైతులు వ్యతిరేకించారు.

సరైన పరిహారం ఇవ్వాలని రైతులు  ధర్నా నిర్వహించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వినియోగించి, దారుణంగా కొట్టి, డిసిఎం లో పోలీస్ స్టేషన్ కు తరలించి వారిని బంధించారు. పోలీస్ లు చేసిన పనికి మహిళ లు,వృద్ధ రైతులు  కన్నీరు మున్నిరయ్యారు.

పోలీస్ లు ఇడ్చుకుంటు తీసుకెళ్లారని కాంగ్రెస్ నాయకుల ముందు ఏడుస్తూ వారు తమ దుఃఖాన్ని వెలిబుచ్చారు. రైతులకు ఎకరానికి 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు చింతలపల్లి జగదీశ్వర రావు డిమాండ్ చేశారు.

పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆయన రైతులను పరామర్శించారు. భూ నిర్వాసితులు రేపటి నుండి రిలే నిరాహార దీక్షలు చేపడుతామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని జగదీశ్వరరావు అన్నారు. రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

Analysis: రోత పుట్టిస్తున్న రాతగాళ్ల నైజం

Satyam NEWS

కాంట్రవర్సీ: సింహాచలంలో రాజకీయ నిర్ణయాలు

Satyam NEWS

హైకోర్టు చెప్పినా వినని జగన్ ప్రభుత్వం: మరో మారు అక్షింతలు

Satyam NEWS

Leave a Comment