29.7 C
Hyderabad
May 3, 2024 06: 38 AM
Slider విజయనగరం

శభాష్ ఖాకీ : 24 గంటలలో నిందితుడ్ని పట్టుకున్న పోలీస్…..!

#PoliceVijayanagaram

విజయనగరం జిల్లా ఖాకీలు తమపై పడ్డ మచ్చను తొలగించుకునే యత్నం లో ఫలితం సాధించారు. గడిచిన మూడు నెలలో జిల్లా వ్యాప్తంగా చోరీలు జరగడంతో నిందితులను పట్టుకోవడంలో ఖాకీ కంటిమీద కునుకు లేకుండా పని చేసిరు.

దీనికి రామతీర్థం నీలాచలం కొండపై జరిగిన రాములోరి విగ్రహ శిరస్సు ఖండన అంశం…పుండు మీద కారం చల్లినట్లైంది. ఓ వైపు స్టేషన్ పరంగా ఐడీ పార్టీ లు నిందితుడ్ని పట్టుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు.

ఈ సమయంలో గజపతినగరం మండల పరిధి భూదేవీ పేటలో అభయాంజనేయ స్వామి లో దొంగతనం జరగడంతో ఖాకీలపై మరో మచ్చ పడింది. అయితే అప్పటికే నమోదైన చోరీ కేసులలో నిందితుల కోసం గాలిస్తున్న గజపతి నగరం పోలీసులకు మరో విషమ పరీక్ష ఎదురైంది.

అయితే గజపతినగరం సీఐ రమేష్, ఎస్ఐ సన్యాసి నాయుడు..భూదేవిపేటలో జరిగిన ఆలయ చోరీ కేసు నిందితులను….24 గంటలు తిరగక ముందే జైలు ఊచలు లెక్కించేలా వ్యవహరించి నిందితుడు పట్టుకుని శభాష్ పోలీసు అనిపించేలా వ్యవహరించారు.

నిందితులను ఖాకీల పట్టుకోలేరన్న మచ్చను…ఒక రోజు లోనే చెరుపుకునేలా వ్యవహరించారనే చెప్పాలి. భూదేవి పేట కేసు తరహా లో ఎలా చేధించారో…మిగిలిన కేసులపై కూడా అంతే నిశితంగా దృష్టి పెట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

జిల్లా పోలీసు అధికారి ఆ విధంగా తమ పోలీసు సిబ్బంది ని ఆదేశించాలని సీనియర్ సిటిజన్ లు కోరుతున్నారు. ఈ కేసును సునాయాసంగా చేధించిన గజపతినగరం సీఐ రమేష్, ఎస్ఐ సన్యాసి నాయుడులను భూదేవిపేట గ్రామస్తులు సన్మానించేందుకు సన్నధ్ధం అవుతుండటం విశేషం.

Related posts

నెల్లూరు కోర్టు చోరీ కేసులో ఎలాంటి సంబంధం లేదు

Satyam NEWS

5 నుండి 9వ తరగతుల విద్యార్థులకు ప్రత్యేక వేసవి శిబిరాలు

Satyam NEWS

గంజాయి మత్తులో పెట్రోలు బంకుపై దాడి చేసిన యువకులు

Satyam NEWS

Leave a Comment