28.7 C
Hyderabad
April 28, 2024 05: 54 AM
Slider ప్రత్యేకం

డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసు: నిందితుడికి పోలీసుల సహకారం

#muppallasubbarao

ఉద్దేశపూర్వకంగానే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయడం లేదు: పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంత బాబు కేసులో పోలీసులు చట్టబద్ద విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ముద్దాయికి సహకరించే విధంగా వ్యవహరిస్తున్నారని ఏపి పౌర హక్కుల సంఘం (ఏపిసిఎల్ఎ) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు పేర్కొన్నారు.

తన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను అతి కిరాతకంగా హత్యచేసి.. డోర్ డెలివరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ముద్దాయి అనంతబాబుకి రిమాండ్ ఇచ్చిన 90 రోజుల్లోగా చార్జీ షీట్ వేయాల్సి ఉన్నప్పటికి పోలీసులు అలా చేయకుండా ఉండటం ముద్దాయికి సహకరించడమే అవుతుందని ముప్పాళ్ళ స్పష్టం చేసారు.

ఇటువంటి కేసులలో విచారణ అధికారి 90 రోజులలో ఛార్జ్ షీట్ కోర్టులో వేయాల్సి ఉందని..లేకుంటే ముద్దాయిని బెయిలు మీద విడుదల చేయాలని చట్టం చెప్తుందన్నారు. దానికి కావలసిన విధంగా ముద్దాయికి అనుకూల విధానాలను కాకినాడ పోలీసులు అవలంభిస్తున్నట్లు తెలుస్తుందన్నారు.

ఆది నుంచి అనంత బాబుకు తమ సంపూర్ణ సహ కారం అందిస్తున్న కాకినాడ పోలీసులు ఇప్పటికీ చార్జిషీట్ దాఖలు చేయకపోవడం అనుమానాలకు బలం చేకూర్చేలా ఉందన్నారు. ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోవడం వల్లే బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్ర యించాల్సి వచ్చిందని ముప్పాళ్ళ పేర్కోన్నారు.

విచారణ అధికారి, కాకినాడ పోలీస్ ఉన్నతాధికారులు ముద్దాయి కి పూర్తిగా సహకరిస్తూ చట్టబద్ధ విచారణ చేయడం లేదని, కాబట్టి సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఈ రాష్ట్ర డిజిపి, చీఫ్ సెక్రటరీ, గవర్నర్లకు ఫిర్యాదు చేశారని తెలిపారు. గతంలో అనంతబాబుపై ఉన్న రౌడీషీట్ నెంబర్ 62 గురించి గానీ.. అతని మీద అడ్డతీగల పోలీస్ స్టేషన్లో ఉన్న మిగిలిన కేసులు, విశాఖపట్నంలో అతని మీద ఉన్న కేసు ఇప్పటివరకు ఎందుకు విచారణ అధికారి ప్రస్తావించకుండా దాచి పెడుతున్నారని అన్నారు.

ఇప్పటికీ నేర స్థలాన్ని, మిగిలిన ముద్దాయిలను, నేరానికి ఉపయోగించిన ఆయుధాలను గుర్తించక పోవడం పోలీసుల నిర్లక్ష్యానికి అలసత్వానికి నిదర్శనమని విమర్శించారు. వీధి సుబ్రహ్మణ్యం కేసులో ఎప్పటి కప్పుడు చట్టపరమైనటువంటి వాస్తవాలను బహిర్గతం చేయకుండా ఉండి ఉంటే.. గతంలో అడ్డతీగల పోలీస్ స్టేషన్లో రెండు ఎస్సీ ఎస్టీ కేసులు మరియు ఇతర కేసులను తప్పుడు కేసులుగా ఏ విధంగా నిర్ధారించి కేసులు మూసివేత(క్లోజ్)చేసారో అదేవిధంగా ఈ కేసు కూడా తొలగింపచేసుకుని ఉండేవారన్నారు.

గతంలో అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంత బాబు రౌడీషీట్ నెంబర్ 62 గా అడ్డతీగల పోలీస్ స్టేషన్లో నమోదయిందని.. ఈ కేసుకు సంబంధించి వివరాలు, ఆధారాలు తాము సంపాదిస్తున్నాము గాని పోలీసులు ఆ సమాచారాన్ని సంపాదించ లేకపోవడం హాస్యాస్పదమన్నారు. అనంత బాబు తరుపున వారు సమాచారం అడిగితే ఒకటి రెండు రోజుల్లోనే ఇచ్చిన అడ్డతీగల పోలీసులు.. తాము సమాచారం కోరితే 25 రోజులు జాప్యం చేసారన్నారు. ఆ తర్వాత కూడా కాగితాలు లేవని సమాచారం ఇచ్చారని ముప్పాళ్ళ చెప్పారు.

విచారణలో కాకినాడ పోలీసుల వైఫల్యం

హత్య జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా నిజమైన నేర స్థలాన్ని విచారణాధికారి గుర్తించలేకపోయారని.. అలాగే ఇప్పటికీ నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని గాని, ఈ నేరానికి పాల్పడిన మిగిలిన ముద్దాయిలను గుర్తించ డంలోగాని పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు.

జిపిఎస్ టవర్ లోకేషన్ ఆధారంగా మరియు కాల్ డేటా ఆధారంగా మిగిలిన ముద్దాయిలను గుర్తించి, నేర స్థలాన్ని గుర్తించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ముప్పాళ్ళ పేర్కొన్నారు. నేరం జరిగిన రోజు అర్ధరాత్రి 1.20 నిమిషాలకు ముద్దాయి అతని భార్యతో కలిసి కారు దిగి తాను నివసిస్తున్న శంకర్ టవర్స్కు వచ్చినట్లుగా సీసీ పుటేజ్లను బట్టి తెలుస్తున్నా.. ఇప్పటివరకు ఆమెను ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. కస్టడీ పిటిషన్ ఎందుకు వేయలేదు

పోస్టుమార్టం రిపోర్ట్ లో మృతుడు బతికి ఉండగానే 31 గాయాలు మూడు అంతర్గత గాయాలు చేసారని పేర్కొంటే, ముద్దాయి తన ఒప్పుదల స్టేట్మెంట్లో మృతుని హత్య చేసిన తర్వాత డంపు యార్డు వద్దకు తీసుకువెళ్లి కొట్టినట్లు పోలీసులకు చెప్పాడన్నారు. అటువంటప్పుడు వెంటనే పోలీసు కస్టడీ పిటిషన్ వేసి ఎందుకు ముద్దాయిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయలేదని కాకినాడ పోలీసు లను నిలదీశారు.

Related posts

న్యూ ఎజెండా: గ్రామాలలో పరిశుభ్రత తాండవించాలి

Satyam NEWS

అటెన్షన్: 21న చూడామణి నామక సూర్యగ్రహణం

Satyam NEWS

ప్రీతీ మరణానికి సంతాపం తెలియజేస్తూ క్యాండిల్ ర్యాలీ

Satyam NEWS

Leave a Comment