విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషనులో కానిస్టేబులుగా పని చేస్తున్న సనపల అజయ్ కుమార్ ఇటీవల ఎస్ ఎల్ పీ ఆర్ బీ విడుదల చేసిన ఎస్ఐ నియామకాల్లో సివిల్ ఎస్ఐ గా జోన్ 1 ఓపెన్ కేటగిరీలో ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ డా. బి.వెంకటరావు మాట్లాడుతూ పోలీసుశాఖలో సివిల్ ఎస్ఐగా ఎంపికైన వన్ టౌన్ పోలీసు స్టేషను కానిస్టేబులు సనపల అజయ్ చేసిన కృషి, సాధనకు ఫలితం లభించిందన్నారు. సాధించిన ఫలితంతో సంతృప్తి చెందకుండా మరింత ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా ప్రయత్నం సాగించాలన్నారు.
అనంతరం, అజయ్ ను సిఐ డా బి వెంకటరావు మరియు ఇతర ఎస్ఐలు, సిబ్బంది అభినందించి, శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా అజయ్ తో కేక్ కట్ చేసి, అజయ్ కు తినిపించారు. అజయ్ ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బి. టెక్ చదివి, 2017లో కానిస్టేబులు గా ఎంపికై, 2019 నుండి వన్ టౌన్ పోలీసు స్టేషనులో పని చేస్తున్నారు.
అజయ్ తండ్రి అప్పాజీ ఎక్సైజ్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేసి, ఉద్యోగ విరమణ చేయగా, తల్లి గృహిణిగా ఉంటున్నారు. అజయ్ భార్య అగ్రికల్చర్ అసిస్టెంట్ గాను, తమ్ముడు IBM లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా కెనడాలో పని చేస్తున్నారు. ఎస్ ఎల్ పీ ఆర్ బీ విడుదల చేసిన ఎస్ఐ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో జోన్ 1లో సివిల్ ఎస్ఐ గా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ లు భాస్కరరావు, అశోక్ కుమార్, నరేష్, తారకేశ్వర రావు, రామ గణేష్, గోపాల్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.