40.2 C
Hyderabad
May 2, 2024 15: 38 PM
Slider హైదరాబాద్

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పై కేసు నమోదు చేయాలి

#devisreeprasad

హిందువుల మనోభావాలను కించపరుస్తూ ప్రకటన చేసిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పైన వెంటనే F.I.R. ను నమోదు చేయాలని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా & బిజెపి వెంగల్ రావు నగర్ డివిజన్ ఇంచార్జ్ బిజెపి అధికార ప్రతినిధి ఏడెల్లి అజయ్ కుమార్ అన్నారు.

ఇటీవల సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఐటమ్ సాంగ్, డివోషనల్ సాంగ్, 2 ఒకటే అనడాన్ని భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా తరఫున తీవ్రంగా అజయ్ కుమార్ అన్నారు.

లలిత కళల్లో ఒకటైన సంగీతాన్ని జీవనోపాధిగా స్వీకరించి జీవనం గడుపుతున్న దేవి శ్రీ ప్రసాద్ కళామతల్లి గా భావించే సరస్వతీ దేవిని కించపరుస్తూ భక్తి పాటలకు, ఐటమ్ సాంగ్ కు ముడిపెట్టడం ఎంతవరకు సబబు అని ఆయనే ఆలోచించుకోవాలన్నారు.

ఏవో నాలుగు పాటలు హిట్ అయినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడొచ్చు ఎవరినైనా కించపరిచే విధంగా వ్యవహరించవచ్చు అనుకుంటే ఆయన అంత మూర్ఖుడు లేదని భావించాలని అన్నారు. అత్యంత ఆరాధ్య మైన, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భక్తి సంగీతాన్ని, కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో దేవి శ్రీ ప్రసాద్ ని తిరగనీవ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తూ, ఇక నుంచి హిందూ సమాజాన్ని కించపరుస్తూ ఎవరైనా తప్పుగా మాట్లాడినట్లయితే వారిని ఉపేక్షించేది లేదని, హిందువుల మనోభావాల్ని కించపరచినందుకు వెంటనే పోలీస్ శాఖ వారు సుమోటోగా కేసు నమోదు చేసి సదరు సంగీత దర్శకుని  పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ఎర్రగొళ్ల మల్లేష్ యాదవ్ కు ఘన సత్కారం

Bhavani

రైతుల భార‌త్ బంద్‌కు టీఆర్ఎస్ పూర్తి మ‌ద్ధ‌తు

Sub Editor

కరోనాపై పోరాటానికి శ్రీచైతన్య విరాళం రూ.కోటి

Satyam NEWS

Leave a Comment