29.7 C
Hyderabad
May 3, 2024 05: 05 AM
Slider విజయనగరం

“లెక్చరర్” అవతారం ఎత్తిన”నేనేరా పోలీస్”..!

#police

ఉత్తరాంధ్ర…. అందునా…అరకు-బొడ్డవర ప్రాంతం…డ్రగ్స్ కు కేంద్రం గా మారుతోందని ఇటీవల బొడ్డవర లో ప్రాంతంలో…కేజీల కొద్ది ళపట్టుబడటమే అందుకు నిదర్శనం. అయితే… ఆ బల్క్ ఎక్కడ నుంచీ సరఫరా అవుతోంది… ఎవరు లబ్ది పొందుతున్నారు…? అసలు ఎవరు సరఫరా చేస్తున్నదీ అన్న అంశాలు…పోలీసు దర్యాప్తు లో తేలాల్సి ఉంది. అయితే… ఒక్క సారి ఆ ఉదంతం వెలుగు చూడటంతో…విజయనగరం జిల్లా పోలీసు బాస్… శాఖ సిబ్బంది ని అలెర్ట్ చేయించారు.

ఈ మేరకు.. ముందు గానే..అందుకు ఏ ఒక్కరూ మరీ ముఖ్యంగా.. యువత ఆ జోలికిపోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని… అన్ని స్టేషన్ ల సీఐలను ఆదేశించారు. ఈ మేరకు విజయనగరం సబ్ డివిజన్ పరిధిలోని విజయనగరం నగర వన్ టౌన్ సీఐ డా.బీ.వెంకటరావు… అలాగే టూటౌన్ సీఐ లక్ష్మణరావు, అలాగే రూరల్ సీఐ తిరుపతి రావులు అలెర్ట్ అయ్యారు. అందులో భాగంగా… నగరంలో ని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్పీ బంగ్లా దగ్గర… శ్రీనివాస జూనియర్ కాలేజీ విద్యార్ధినీ విద్యార్థుల కూ…సీఐ డా.వెంకటరావు…”క్లాస్” తీసుకున్నా రు.

కళాశాల లెక్చరర్ వలే కాలేజీ లో స్టూడెంట్స్ ఉన్న రూం లో..పోలీసు యూనీఫాంలో ఉండీ…పోలీసు కాస్త లెక్చరర్ అవతారం ఎత్తి… డ్రగ్స్ కు బానిస కావొద్దని…”క్లాస్” తీసుకున్నారు.ఈ సందర్భంగా శ్రీనివాస కళాశాల విద్యార్థులతో వన్ టౌన్ పోలీసులు మమేకమయ్యారు. ఈ సందర్భంగా సీఐ డా. బి.వెంకటరావు మాట్లాడుతూ – విద్యార్ధులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు.

ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, సమాజంలో బాధ్యత కలిగిన పౌరులుగా వ్యవహరించాలి అన్నారు. సైబర్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటర్నెట్ ను వినియోగించి, విజ్ఞానం పెంపొందించు కొనేందుకు ప్రయత్నించాలని అన్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ దూరంగా ఉండాలని, రహదారి భద్రతా పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. దిశా యాప్ ను విద్యార్థినులు తప్పనిసరిగా తమ మొబైల్స్ లో డౌన్లోడ్ చేసుకోవాలని, ఆపద సమయంలో యాప్ వినియోగించి, రక్షణ పొందాలని సీఐ డా బి.వెంకటరావు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ భాస్కరరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

తానే

Satyam NEWS

ఘనంగా మోత్కుపల్లి జన్మదిన వేడుకలు

Satyam NEWS

వికృత నగ్న వీడియో కాల్ చేసిన ఎంపిని సస్పెండ్ చేయాలి

Satyam NEWS

Leave a Comment