30.7 C
Hyderabad
April 29, 2024 05: 06 AM
Slider ముఖ్యంశాలు

వికృత నగ్న వీడియో కాల్ చేసిన ఎంపిని సస్పెండ్ చేయాలి

#nudevideo

ఒక మహిళతో వికృతంగా నగ్న వీడియో కాల్ మాట్లాడిన హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ అమరావతి బహుజన జెఎసి అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇంత నీచంగా, నికృష్టంగా లోక్ సభ చరిత్రలో మరే పార్లమెంటు సభ్యుడు ప్రవర్తించి ఉండరని ఆయన అన్నారు. నైతిక సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించిన గోరంట్ల మాధవ్ పార్లమెంటు సభ్యుడుగా ఉండేందుకు అనర్హుడని బాలకోటయ్య తన లేఖలో తెలిపారు. ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం ఇది.

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా దివ్య సముఖమునకు

ఆంధ్రప్రదేశ్ అమరావతి బహుజన జెఎసి  అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్రాస్తున్న ఫిర్యాదు లేఖ

స్పీకర్ సాబ్,

గత మూడు రోజులుగా రాష్ట్రంలోనూ, దేశంలోనూ చర్చనీయాంశంగా మారిన ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ అనాగరిక, కుసంస్కార, వికృత న్యూడ్ వీడియో  మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుందని భావిస్తున్నాను.

చట్టసభల గౌరవాన్ని, ప్రజాప్రతినిధుల కనీస నైతిక నిబంధనలను, విలువలను కాలరాస్తూ,  సదర సభ్యుడు ఒక వీడియో కాల్ లో చూపించిన అంగ ప్రదర్శన పార్లమెంటరీ వ్యవస్థకు అప్రదిష్ట. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధ్యక్షులు  తక్షణం ఆరోపణలు ఉన్న సభ్యుల నుంచి రాజీనామా కోరాలి.

లేదా పార్టీ నుంచి, పార్లమెంటు సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని మహిళలు, పౌర సమాజం సిగ్గులేని ఎంపి ప్రవర్తన పట్ల వీధుల్లోకి వచ్చి గొంత్తెత్తి అరుస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షులు వై.ఎస్ .జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. విచారణ పేరిట, నిజానిజాల ముసుగులో ఈ గలీజు ఎంపీ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

నాకు తెలిసి ఒక పార్లమెంట్ సభ్యునికి ప్రవర్తనా నియమావళి ఉంటుంది. ప్రజల చేత ఓట్లు వేయించుకొని దేశం గర్వించదగిన పార్లమెంటుకు వెళ్ళినప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదు. ఈ న్యూడ్ వీడియో అంశాన్ని పరిశీలించి సదరు ఎంపీ గోరంట్ల మాధవ్ ను ఎంపీ పదవి నుంచి తక్షణం అనర్హులుగా ప్రకటించండి.

విచారణకు ఆదేశించి చట్టపరమైన  చర్యలు తీసుకోండి. చట్టసభల గౌరవాన్ని, తద్వారా దేశ గౌరవాన్ని కాపాడండి. ఆజాదీ అమృత్ మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా… దేశం గర్వించే రీతిలో, పార్లమెంటరీ వ్యవస్థను కళంకిత పాపం నుంచి తప్పించే రీతిలో స్పందిస్తారని కోరుతూ….

పోతుల బాలకోటయ్య, అమరావతి బహుజన జెఏసి, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా

గమనిక: ఈ లేఖను శనివారం ఉదయం స్పీకర్ మెయిల్ ఐడి అయిన speakerloksabha@sansand.nic.in కు పంపటం జరిగింది.

Related posts

ఉచిత హామీలతో ప్రజా జీవితాలతో చెలగాటం!

Sub Editor

ఆంధ్రా యూనివర్శిటీయా? లేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా?

Satyam NEWS

ఘనంగా వినాయక నిమజ్జనం

Bhavani

Leave a Comment