42.2 C
Hyderabad
May 3, 2024 16: 48 PM
Slider పశ్చిమగోదావరి

గురుకుల విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరాలి

ఏలూరు జిల్లా పెదవేగి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు దేశ విదేశాలలో మంచి ఉద్యోగులుగా గొప్ప డాక్టర్ లు గా ఇంజనీర్లుగా స్థిరపడ్డారని పూర్వ విద్యార్థులను ఆదర్శం గా తీసుకుని
గురుకుల పాఠశాలలో నేడు చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఏలూరు ఆర్ డి ఓ పెంచల్ కిషోర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.ఆర్ డి ఓ పెంచల్ కిషోర్ శుక్రవారం రాత్రి పెదవేగి అంబేద్కర్ సోషల్ వెల్పేర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించి విద్యార్థులతో పాటు హాస్టల్ లోనే నిద్రచేశారు.

పెదవేగి తహసీల్దార్ నాగరాజు కూడా ఆర్ డి ఓ తో పాటు హాస్టల్ నిద్రలో పాల్గొన్నారు.విద్యార్థులకు అందించే ఆహార పదార్దా లైన బియ్యం పప్పులు.కూరగాయలు.గుడ్లు.వంటి వి తాజా గా ఉన్నాయా లేదా అని పరిశీలించారు.రోజువారీగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యార్థులకు వండి పెట్టె మెనూ వివరాలను ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ని అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు.విద్యార్థులు మంచి క్రమ శిక్షణలో బాటు మంచి అలవాట్లు కలిగి ఉండాలని తెలిపారు.త్రాగునీరు పై ఆరాతీశారు.పాఠశాలలో విద్యార్థులకు వసతి గృహం లో ఉన్న బెడ్ లను పరిశీలించారు.

బాత్ రూమ్ లు.టాయిలెట్ లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. హాస్టల్ కు నాణ్యమైన బియ్యం అందుతున్నాయా లేదా అని ఆర్ డి ఓ పెంచల్ కిషోర్ నేరుగా బియ్యం స్టార్ ని పరిశీలించి బియ్య బస్తాలు పరిశీలించారు.తరగతి గదులలో బెంచి లు.డెస్క్ లు వంటి కనీస సదుపాయాల పై ఆర్ డి ఓ ఆరా తీశారు.ప్రతి విద్యార్థి చదువు పట్ల అస్సక్తి అవగాహన పెంచుకోవాలన్నారు.వ్యక్తిగతపరి శుభ్రత ఆరోగ్యం ఉండాలన్నారు.చదువుతో పాటు.క్రీడలలో కూడా రాణించాలని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులతో కలిసి ఆర్ డి ఓ పెంచల్ కిషోర్ శనివారం ఉదయం అల్పా హారాన్ని తీసుకున్నారు.

ఈ కార్యక్రమం లో ఆర్ డి ఓ వెంట పెదవేగి తహసీల్దార్ నల్లమెల్లి.నాగరాజు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.శనివారం ఉదయం గురుకుల పాఠశాల ప్రాంగణం లో ఉన్న తుప్పలను, ముళ్ళ కంచెలను, దిబ్బలను, ఆర్ డి ఓ పెంచల్ కిషోర్, తహసీల్దార్ నాగరాజు జె సి బి తో బాగు చేయించి చదును చేయిస్తున్నారు. పాఠశాల పరిసరాలన్ని పరి శుభ్రంగా రూపు దిద్దుతున్నారు.

Related posts

వ్యక్తి ఆరాధనకు పరాకాష్ట: దుర్గా మాత పక్కన దీదీ విగ్రహం

Satyam NEWS

అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

Satyam NEWS

బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తారా..?

Satyam NEWS

Leave a Comment