40.2 C
Hyderabad
April 26, 2024 11: 29 AM
Slider ముఖ్యంశాలు

‘‘అశ్లీల సిఐ’’ ని కాపాడుతున్న గుంటూరు పోలీసు పెద్దలు

#navataram party

గుంటూరు లో అశ్లీల నృత్యాలు చేస్తూ, రేవ్ పార్టీ లో దొరికిన సీసీఎస్ సి.ఐ. వెంకటేశ్వరరావు ను సస్పెండ్ చేస్తే మరలా సస్పెన్షన్ ఎత్తివేస్తారని, ఆయన పేరు FIR లో చేర్చకుండా వదిలితే ప్రజల్లో పోలీసు శాఖ పై నమ్మకం పోతుందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.

గుంటూరు అర్బన్ ఎస్పీ స్పందించి కేసులో సి ఐ వెంకటేశ్వరరావు పేరు చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరు లోని పట్టాభిపురం పోలీసులు కష్టపడి నిజాయితీగా సి ఐ ను అరెస్టు చేసినప్పటికీ ఆయన పేరు FIR లో చేర్చకుండా మిగిలిన వారిపేర్లు చేర్చడం పోలీస్ శాఖ కు చెడ్డపేరు తెస్తుందని అన్నారు.

పోలీసులకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండకూడదని రేవ్ పార్టీ లో పాల్గొన్న సిఐ పై ఖచ్చితంగా FIR చేయాలని, చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు.

గతంలో చిలకలూరిపేట పట్టణ సి ఐ గా చేసిన సమయంలో వెంకటేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరించి విఆర్ కు వెళ్లారని,శారదా హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు పట్ల కూడా దురుసుగా వ్యవహరించారని, ఎస్సి ఎస్టీ కమిషన్ ఆదేశాలను అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు.

రేవ్ పార్టీ కల్చర్ అరికట్టేందుకు పోలీసు శాఖ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు నవతరం పార్టీ నుండి వినతిపత్రాన్ని అందిస్తామని తెలిపారు. గుంటూరు అర్బన్ ఎస్పీ కి కూడా వినతిపత్రాన్ని అందిస్తామని తెలిపారు.

Related posts

Wuhan disaster: దుష్ట చైనా దే ఈ మహాపాపం

Satyam NEWS

మల్లంపల్లి మండల సాధన కమిటీకి పెరుగుతున్న మద్దతు

Satyam NEWS

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీకి షర్మిల రెడీ?

Satyam NEWS

Leave a Comment