37.2 C
Hyderabad
April 30, 2024 11: 15 AM
Slider మహబూబ్ నగర్

అకాల వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అకాల వర్షాలు ఎప్పుడైనా ఎక్కడైనా పడవచ్చునని అందువల్ల ధాన్యం తడిచి రైతులు నష్ట పోవద్దు ముందస్తుగా సిద్ధంగా ఉండాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో వరి ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరు పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో ధాన్యం పంట ఆలస్యం అవ్వడంతో కొనుగోలు ఇప్పుడే ఊపందుకుంటుందన్నారు.

ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్నాయి ఇలాంటి పరిస్థితిలో రైతులు ధాన్యం వర్షానికి తడవకుండా ఉండేందుకు కావలసినన్నీ టార్పాలిన్లు ముందే ఇచ్చి ఉండాలని ఆ విధంగ ముందస్తు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్, సివిల్ సప్లయ్, కో అపరేటివ్ అధికారులను ఆదేశించారు. టార్పాలిన్లు లేకపోవడంతో ధాన్యం వర్షార్పణమ్ వంటి వార్తలు రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ధాన్యం రవాణాలో సైతం ఎలాంటి లోటు కానీ అలసత్వం ప్రదర్శించారాదని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. సేకరించిన ధాన్యం వివరాలు ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్ లో నమోదు కావాలని, ఆన్లైన్ర్ నమోదు ఆలస్యం కారణంగా రైతుల ఖాతాలో డబ్బులు సకాలంలో పడలేదనేది ఉండవద్దన్నారు.

అన్ని కొనుగోలు కేంద్రాల్లో తేమ కొలిచే యంత్రాలు, అవసరానికి మించి టార్పాలిన్లు, వేయింగ్ మిషన్లు, కంప్యూటర్స్ అన్ని సిద్ధంగా ఉంచుకొని రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రస్తుత స్థితి పై సివిల్ సప్లయ్ అధికారిని వివరాలు అడుగగా జిల్లాలో మొత్తం 224 సెంటర్లు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ధాన్యం కోతను బట్టి 42 సెంటర్లకు ధాన్యం వస్తుందని సివిల్ సప్లయ్ జిల్లా అధికారి మోహన్ బాబు తెలిపారు.

యాసంగిలో 2.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు వస్తుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 690 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. టార్పాలిన్లు, గన్ని బ్యాగులు అన్ని సెంటర్లకు సరిపడ పంపించడం జరిగిందని, తేమ మిషన్లతో సహా అన్ని కొనుగోలు కేంద్రాల్లో సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి మోహన్ బాబు, జిల్లా కో అపరేటివ్ అధికారి పత్యానాయక్, పి.డి. డి.ఆర్.డి.ఏ నర్సింగ్ రావు, మార్కెటింగ్ శాఖ అధికారిణి బాలామణి, డి.యం సివిల్ సప్లయ్ బాలరాజ్, మెప్మా కోఆర్డినేటర్ రాజేష్, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యం న్యూస్. నెట్, నాగర్ కర్నూలు జిల్లా

Related posts

సెల్ఫీ వీడియో తీసి దంపతులు ఆత్మహత్య

Satyam NEWS

ప్రజా పాలన దరఖాస్తు ఫారాల కొరత లేదు

Satyam NEWS

సొంత వారినే కాటేస్తున్న జే -మాఫియా..!

Satyam NEWS

Leave a Comment