33.7 C
Hyderabad
April 29, 2024 23: 35 PM
Slider సినిమా

ప్రకాశ్ రాజ్ ఓటమికి రాజకీయ పార్టీల భారీ స్కెచ్

#prakashraj

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో ప్రకాశ్ రాజ్ ను ఓడించేందుకు రాజకీయ పార్టీలు రంగంలో దిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు పూర్తి స్థాయిలో తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయని సినీ రంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రకాశ్ రాజ్ ను ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వకూడదని వ్యూహాలు రచిస్తున్నాయి. బిజెపి నేరుగా రంగంలో దిగి ప్రకాశ్ రాజ్ ను ఓడించాలని పిలుపునిచ్చింది. బిజెపి సినీ నటుల సంఘానికి చెందిన సి వి ఎల్ నరసింహారావు ప్రకాశ్ రాజ్ కు ఓటు వేయవద్దని పిలుపునివ్వగా, బిజెపికి చెందిన కోట శ్రీనివాసరావు రంగంలో దిగారు. ప్రకాశ్ రాజ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఆయన మంచు విష్ణుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రకాశ్ రాజ్ ప్రధాని నరేంద్రమోడీ బద్దవ్యతిరేకి. కర్నాటకలో జరిగిన ఎన్నికలలో పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ బిజెపిని పలు రకాలుగా విమర్శించారు. బిజెపి పాలనపై తీవ్రమైన వ్యతిరేక భావనలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ప్రకాశ్ రాజ్ ఇప్పుడు మా ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నందున బిజెపి రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే మంచు విష్ణు ప్యానెల్ లో బిజెపి నాయకుడు బాబూ మోహన్ ను కీలకమైన కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి పోటీకి దించారు. ప్రకాశ్ రాజ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న మంచు విష్ణు రాజకీయ పార్టీల సహకారం పూర్తి స్థాయిలో తీసుకుంటున్నారు. బిజెపికే చెందిన కృష్ణంరాజు తనకు పూర్తి మద్దతు ఇస్తున్నారని ఇప్పటికే మంచు విష్ణు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తన అన్న సూపర్ స్టార్ కృష్ణ కూడా మంచు విష్ణుకు మద్దతు ఇచ్చే విధంగా ప్లాన్ చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను మంచు విష్ణు చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నెత్తి నోరూ బాదుకుంటున్నా ఎన్నికల నిర్వహణ అధికారి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన బావ అని చెబుతున్న మంచు విష్ణు ఆ పార్టీ నుంచి పూర్తి సహకారాలు తీసకుంటున్నారని అంటున్నారు. ఇటీవల తనను కలిసేందుకు వెళ్లిన సినీ నిర్మాతలతో ఏపి మంత్రి పేర్ని నాని కూడా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ను ఓడించి రావాలని వారిని ఆదేశించినట్లు తెలిసింది. కేవలం 900 మంది సభ్యులు ఉన్న మా ఎన్నికలను రాజకీయ పార్టీలు ఇలా కీలకంగా ఎందుకు భావిస్తున్నాయో తెలియదు. సినీ నటులను కంట్రోల్ చేసేందుకు మా ఉపకరిస్తుందని భావిస్తున్నందునే ఇంత భారీ ఎత్తున రాజకీయ పార్టీలు మోహరించాయని అంటున్నారు.  

Related posts

రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి నిధులివ్వాలి

Satyam NEWS

19 నుండి ప్ర‌భాస్ ఆదిపురుష్ మోష‌న్ క్యాప్చరింగ్ ప్ర‌క్రియ‌ ప్రారంభం

Satyam NEWS

యుద్ధo ఆపేందుకు ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment