38.2 C
Hyderabad
April 29, 2024 13: 31 PM
Slider కవి ప్రపంచం

విషవలయం

#Manjula Surya

ముసురు కమ్మెను ఉసురుపై

ఎసరు పెట్టెను విషమై

అసరు చూపెను మరల నరులపై

కసురుతున్నది కరోనాయే అనుకుంటే

విసురుగా వచ్చెను విషవాయువులు

కసరు తీసేందుకు

మళ్ళీ ఉపద్రవం ఉరికివచ్చెను

ఉప్పెనలా ముంచెత్తెను

కుప్పలా పడేసెను శవాలను

ఒంటరి చేసెను ఎన్నో కుటుంబాలను

ఎంతని చెయ్యాలి మనిషి పోరాటం???

రెక్కలు తొడిగిన ధరలతోనా

రెక్కాడితే డొక్కాడని బతుకులతోనా

రక్కసికోరలు చాచిన కొరొనాతోనా

కాచుక కూర్చున్న కనపడని ఉత్పాతాలతోనా

గుప్పెడంత గుండె కోసం అంతులేని ఆరాటం

ఎంతకాలమీ చెలగాటం

ఒళ్ళు గుల్లవుతుండే

ఇళ్లు వల్లకాడవుతుండే

ప్రాణాలు చెల్లవుతుండే

గడిచే ప్రతి ఘడియ ఒక వరం అవుతుండే

పొరపాటొకరిది గ్రహపాటింకొకరిది

కారణం ఒకరు శిలువ వేసుకునేది మరొకరు

అజాగ్రత్త ఒకరిది ఆకాలమరణం మరొకరిది

తప్పిదం ఒకరిది  శిక్ష మరొకరిది

ప్రతిసారీ ఇదే తప్పిదం

పునశ్చరణమవుతున్న దారుణం

ప్రకృతి తీర్పో పరమాత్మ తీర్పో

భుక్తాయించేది మాత్రం మానవుడే

సామాన్య మానవుడే

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

భారతీయ వలసదారులకు వరాలు కురిపించబోతున్న బైడెన్

Satyam NEWS

పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్.కె.రోజాను కలిసిన ఆశా మాలవ్య

Bhavani

రాజనీతిజ్ఞుడు

Satyam NEWS

2 comments

Prasanth busmi May 16, 2020 at 6:06 PM

Awesome

Reply
Yssubramanyam June 14, 2020 at 4:01 AM

చాలా బాగా వివరించారు

Reply

Leave a Comment