31.2 C
Hyderabad
May 2, 2024 23: 25 PM
Slider ఖమ్మం

పొంగులేటీ….? చివరకు ఇదా నీ పరిస్థితి?

#Sharmilas party

అధికార బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చివరికి షర్మిల పార్టీలో చేరుతున్నారా? ఆయన వైఎస్ షర్మిల తో భేటీ అయిన తర్వాత తెలంగాణ రాజకీయ నాయకులు అందరూ ఆశ్చర్య పోయారు. ఇదేమిటి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు? అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ లో ఒక రహస్య ప్రాంతంలో సమావేశం నిర్వహించుకున్నారు. వారిద్దరి మధ్య గంట పాటు చర్చలు జరిగాయి. పార్టీలో చేరాలని వైఎస్ షర్మిల ఆయనను ఆహ్వానించినట్లు చెబుతున్నారు.

త్వరలో YSR తెలంగాణ పార్టీలో చేరేందుకు పొంగులేటి సిద్ధం అయ్యారని కూడా అంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుగా బీజేపీతో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారు. ఈ రెండు పార్టీలతో చర్చల సందర్భంగా ఆయన పలు డిమాండ్లు వారి ఎదుట ఉంచినట్లు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యత తాను తీసుకుంటానని, అందువల్ల ఆ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను తనకు అప్పగించాలని కోరారు. ఈ నియోజకవర్గాలలో తాను అభ్యర్ధులను నిలబెట్టుకుని వారిని గెలిపించుకుంటానని చెప్పినట్లు అంటున్నారు.

అయితే దీనికి బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ అంగీకరించలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత మేరకు చర్చలు జరిపినా, బీజేపీ మాత్రం ఈ డిమాండ్ ను ఆదిలోనే తిరస్కరించింది. వ్యక్తిగతంగా పార్టీలో చేరాలి తప్ప డిమాండ్లతో పార్టీలోకి తీసుకునే అవకాశమే లేదని బీజేపీ స్పష్టం చేసిందని అంటున్నారు. గతంలో చేరిన ఏ నాయకుడు కూడా ఇలాంటి డిమాండ్లు చేయలేదని కూడా వారు అన్నారు. దాంతో పొంగులేటి డిమాండ్ ను బీజేపీ తిరస్కరించింది.

అంతే కాకుండా ఆయన సీటుకు కూడా ఇప్పుడే గ్యారెంటీ ఇవ్వలేమని కూడా బీజేపి చెప్పిందట. కాంగ్రెస్ పార్టీ కొద్ది మేరకు ఆయన డిమాండ్ పై చర్చించింది. అయితే అన్ని స్థానాలూ ఆయనకే అప్పగించేందుకు కుదరదని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని అంటున్నారు. ఆయనకు వేరే పార్టీ ఏదీ లేకపోవడంతో షర్మిలతో చర్చించినట్లు చెబుతున్నారు.

షర్మిల వచ్చే ఎన్నికలలో పాలేరు నుంచి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నందున పొంగులేటి తో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పొంగులేటి ఆశించిన మేరకు అన్ని డిమాండ్లకు షర్మిల అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఇది పొంగులేటి రాజకీయ జీవితానికి చివరి మజిలీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related posts

మాతృ భాషలో బోధన జరగకపోతే విపరీత పరిణామాలు

Satyam NEWS

మరో భారీ బడ్జెట్ తో ప్రభాస్ సినిమా

Satyam NEWS

సినిమా సౌథానికి “శంకుస్థాపన” చేసిన అశోకచక్ర మూవీస్

Bhavani

Leave a Comment