29.7 C
Hyderabad
May 1, 2024 03: 51 AM
Slider రంగారెడ్డి

నోటీసులు ఇవ్వ‌కుండా గుడిసెలు కూల్చివేయ‌డం అమానుషం

#sherilingampalli

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని జి.పి.ఆర్.ఏ క్వార్టర్స్ లో గుడిసెల తొలగింపును అడ్డుకోవడానికి వెళ్తున్న గచ్చిబౌలి కార్పోరేటర్ గంగాధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా నివాసముంటున్న గుడిసె వాసులను మంగళవారం జిహెచ్ఎంసి అధికారులు అక్రమంగా ఖాళీ చేయించారు. అనంతరం బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ,గచ్చిబౌలి కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలను నడి రోడ్డు మీద వేయడం అధికారులకు తగదని ఎన్నో ఏళ్లుగా  స్థిర నివాసం  ఏర్ప‌ర‌చుకున్న  గుడిశవాసులను ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా కూల్చివేయ‌డం అమానుషం అని అన్నారు. నిరుపేద‌ల ప‌ట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం  త‌గిన మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌న్నారు. అధికారపార్టీ వారి అదేశాలతోనే ఇలా ఏదో ఒక కారణం చెప్తూ పెద్దవారి పై ప్రతాపం చూపెట్టడం దారుణమన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలే తగిన బుద్ధి చెబుతారని 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఇక్కడ ఉన్న చట్టం, ఇక్కడున్న పోలీస్ లు అధికార పార్టీ కి కొమ్ము కాస్తూ వారికి మాత్రమే రక్షణ ఇస్తూ వారి కార్యక్రమాలను కొనసాగిస్తూన్నారాన్నారు. ప్రజల కోసం పని చేసే పార్టీలను  గొంతు నొక్కే ప్రయత్నం చేయటం దారుణం అనీ అన్నారు.

ఇది ప్రభుత్వం  క్రూరత్వానికి నిదర్శనం అని అన్నారు. ఇది ఎల్లకాలం చెల్లదన్నారు. ఈ రోజు మీరు అణచి వేయవచ్చు కానీ రాబోయే కాలంలో మీకు చేదు అనుభవం తప్పదు అనీ అన్నారు. గుడిసె వాసులకు  బీజేపీ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంతుందని, నిరుపేదలకు ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్‌  రాఘవేంద్ర రావు,చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బోబ్బా నవతా రెడ్డి,మాదాపూర్ డివిజన్ బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్,శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్,రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి , గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివ సింగ్, తిరుపతి , గచ్చిబౌలి డివిజన్ ఓబీసీ ఉపాధ్యక్షులు హరీష్ శంకర్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షురాలు ఇందిరా, గచ్చిబౌలి డివిజన్ కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకురాలు వరలక్ష్మి, సీనియర్ నాయకులు, నర్సింగ్ నాయక్,శేకర్, లడ్డు యాదవ్,కిరణ్ గౌడ్, మూర్గ రంగస్వామి ముదిరాజ్, గోపాల్,అరవింద్ సింగ్,నరేష్,చిన్న,టింకు, విష్ణు,క్రాంతి,బిజెపి నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

ఓదెల రైల్వేస్టేషన్’ వశిష్ట సింహ లుక్ విడుదల

Sub Editor

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

Satyam NEWS

విద్యార్ధులచే పోలేరమ్మ హుండి ఆదాయం లెక్కింపు

Satyam NEWS

Leave a Comment