21.7 C
Hyderabad
December 2, 2023 04: 03 AM
Slider గుంటూరు

పేదల ఇల్లు తొలగిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు

#tadepalli

తాడేపల్లిలోని మదర్ థెరిసా కాలనీ, అమరారెడ్డి నగర్ కాలనీలో గత 40 సంవత్సరాలుగా నివాసముంటున్న పేద ప్రజలకు నోటీసులు ఇవ్వడం అన్యాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి 5 వ వార్డు లోని మదర్ థెరిసా కాలనీ, అమరారెడ్డి నగర్ ప్రాంతాల్లో సిపిఐ నేతల బృందం మంగళవారం పర్యటించింది. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేద ప్రజల ఇళ్లకు నోటీసులు ఇవ్వడం అన్యాయమని అన్నారు. పేద ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లను తొలగించాలని ఇరిగేషన్ అధికారులు పేద ప్రజల ఇళ్లకు నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. కాలనీలో నివాసముంటున్న పేద ప్రజల వద్ద ఇంటి పన్నులు,కరెంటు బిల్లులు,వాటర్ బిల్లులు ఎందుకు కట్టించుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మదర్ థేరిసా కాలనీలో రోడ్డు కూడా వేశారని ఇప్పుడు ఖాళీ చేయమనడం సరైనది కాదని అన్నారు. మదర్ తెరిసా కాలనీ,  అమరారెడ్డి నగర్ కాలనీ వాసులకు వారు నివాసం ఉన్న చోటనే నిలపట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని అన్నారు. న్యాయం జరిగే వరకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య,తాడేపల్లి మండల కార్యదర్శి ముసునూరు సుహాస్ మాట్లాడుతూ పేదల ఇళ్లను ఖాళీ చేయమనడం అన్యాయమని అన్నారు.వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మంగళగిరి మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు, తాడేపల్లి పట్టణ సహాయ కార్యదర్శి తుడిమెల్ల వెంకటయ్య,మునగాల రామారావు, పంతగాని మరియదాసు, హనోక్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హేట్సాఫ్: పారిశుద్ధ్య కార్మికుల త్యాగం వెలకట్టలేనిది

Satyam NEWS

శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు

Satyam NEWS

నారా లోకేష్ తో డీబీహెచ్ పీయస్ అధ్యక్షుడు భేటీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!