19.7 C
Hyderabad
December 2, 2023 05: 33 AM
Slider ప్రకాశం

టిడిపి నేతలపై అక్రమ కేసులను ఖండిస్తున్నాం

#tnsf

నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శిలో భారీ ప్రదర్శన నిర్వహించినందుకు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, డోల బాలవీరాంజనేయ స్వామి, ఇంచార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు 35 మంది టీడీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామని యర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (TNSF) తెలిపింది. భారత రాజ్యాంగం ప్రకారం తమ నాయకుడికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తే అక్రమంగా కేసులు పెట్టడం దారుణమని వారు తెలిపారు. పోలీసుల తీరుపై తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (TNSF) తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే కేసును ఉపసంమహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని వారన్నారు.

Related posts

మేడారం జాతర పనులకు ప్రతిపాదనలు వెంటనే పంపండి

Satyam NEWS

అగ్రస్తానంలో రాహుల్

Murali Krishna

రియల్ విజన్ ఇన్ఫ్రా కార్పొరేట్ కార్యాలయం ఆరంభం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!