26.7 C
Hyderabad
May 3, 2024 08: 35 AM
Slider నెల్లూరు

పేద వృద్ధ ఆర్యవైశ్యునికి ఆర్థిక సహాయం

#kavali

కావలి పట్టణం 33 వ వార్డు నందు నివాసముండే పెసల సత్యనారాయణ నిరుపేద. సత్యనారాయణ భార్య విజయలక్ష్మి ఇంటిలో అప్పచ్చులు తయారు చేస్తే అవి బజారులో షాపులకు విక్రయించి దాని మీద వచ్చే ఆదాయంతోనూ వృద్ధాప్య పింఛనుతో కుటుంబం పోషణ జరుగుతున్నది. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం బాగాలేక రెండు లక్షల 50 వేల రూపాయలు అప్పులు చేసి చెన్నైలోని విజయ హాస్పిటల్లో చికిత్స పొంది ఈ మధ్యనే కావలి రావడం జరిగినది. కుటుంబ పోషణ జరగక నెలకి 6000 మందులు కొనలేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో వార్డు లోని మాజీ కౌన్సిలర్ అమరావేదగిరి సుబ్బరాయుడు గుప్తాకు తెలిసింది. దాంతో ఆయన 25 వేల రూపాయలు నగదు, వారి అన్న కుమారుడు పెసల కిరణ్ కుమార్ ఫోన్పే ద్వారా పదివేల రూపాయలు మొత్తం 35 వేల రూపాయలు పట్టణంలోని ఆర్యవైశ్య ప్రముఖుల ద్వారా ఈ రోజున స్థానిక ఏవీఎస్ కల్యాణ మండపం నందు అందించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీరామ్ మనోహర్ బాబు, ఇలింద్ర వెంకటేశ్వర్లు, కనుమర్లపూడి వెంకటనారాయణ, మామిడి రామకృష్ణ, తిరువీధి ప్రసాద్, నల్లూరు వెంకట రమేష్, చీరెళ్ళ కిషోర్ గుప్తా, గాదంశెట్టి మధు, టంగుటూరి రవికుమార్, సోమిశెట్టి రవి శేఖర్ రావు, ఓరుగంటి రామకృష్ణ, ఓరుగంటి సురేష్, సామి శేషు, ఆర్యవైశ్య మిత్ర బృందం సభ్యులు భాస్కరుని బాలాజీ, అనుమాల శెట్టి సుధీర్, బొగ్గవరపు శ్రావణ్ కుమార్, వేమూరు శ్రీనివాసులు, లక్కీ ఇన్నర్స్ అధినేత కోట శ్రీధర్, వైకుంటపురంలోని మెడికల్ షాపు నిర్వహించే ముమ్మడిశెట్టి శేఖర్, సుగుణ ఆయుర్వేద ఆలయం యజమాని పేరూరి మల్లేశ్వరరావు కుమారుడు పేరూరి కనకేశ్వరరావు, తట్టవర్తి సుధాకర్, గాదంశెట్టి రవికుమార్, గాదం శెట్టి సారధి, సోమిశెట్టి సుబ్రహ్మణ్యం, వెలుగూరి వెంకటఈశ్వర్ నవీన్ కుమార్, పెసలు వెంకటేశ్వర్లు, కాసా విజయ్, గుంట్ల చంగల రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Big blast: తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో బాంబులు

Satyam NEWS

పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి ఐకె రెడ్డి

Satyam NEWS

విజయనగరానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స..!

Bhavani

Leave a Comment