40.2 C
Hyderabad
April 29, 2024 16: 03 PM
Slider ముఖ్యంశాలు

పార్టీ లకు విరాళాల వెల్లువ

#parties

గడిచిన ఆరేండ్లలో (2016-22) అత్యధిక విరాళాలు సాధించిన ప్రాంతీయ పార్టీల్లో బిజూ జనతాదళ్ మొదటి స్థానంలో నిలవగా… బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ కైవసం చేసుకుంది. దేశంలోని అన్ని (ఏడు నేషనల్, 24 రీజినల్) పార్టీలతో పోలిస్తే విరాళాల సేకరణలో గులాబీ పార్టీ ఐదో స్థానంలో నిలిచింది. అత్యధిక డొనేషన్లు పొందిన పార్టీల్లో (జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలిపి) బీజేపీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే ఆ తర్వాత కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఉన్నాయి.

నాల్గో స్థానాన్ని బీజేడీ కైవసం చేసుకోగా ఐదో స్థానాన్ని బీఆర్ఎస్ ఆక్రమించింది. దేశం మొత్తం మీద ఏడు జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలు గడిచిన ఆరేండ్లలో రూ.16,437 కోట్ల మేర విరాళాలు పొందినట్టు ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ సంస్థ) తాజా నివేదికలో వెల్లడైంది.

2016 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు బీఆర్ఎస్ పార్టీ పొందిన విరాళాలు రూ.476.89 కోట్లు. ఇందులో దాదాపు 80% (రూ.383.65 కోట్లు) కేవలం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూరినవే. నేషనల్, రీజినల్ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ రిపోర్టులు, ఏయే రూపాల్లో ఎంత ఆదాయం సమకూరిందో వివరించే ఫైనాన్షియల్ రిపోర్టుల ఆధారంగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

తెలంగాణ ధనిక రాష్ట్రం తరహాలోనే బీఆర్ఎస్ కూడా ధనిక పార్టీయేనంటూ గతేడాది ప్లీనరీ సందర్భంగా అధినేత కేసీఆర్ పేర్కొని స్థిర చరాస్తులతో కలుపుకుని మొత్తం రూ.వెయ్యి కోట్లకు పైగానే ఉన్నట్టు తెలిపారు. సొంతంగా విమానాన్ని సైతం కొనుక్కునేంత స్థోమత ఉన్నదని, జాతీయ పార్టీలతో పోలిస్తే బీఆర్ఎస్ తక్కువేం కాదంటూ వ్యాఖ్యానించారు. అన్ని జిల్లాల్లో ఎకరం చొప్పున పార్టీ ఆఫీసులకు స్థలాలు కూడా నామినల్ రేటుకు సమకూరాయి.

దీనికి తోడు నాలెడ్జి సెంటర్ పేరుతో ఖరీదైన ప్రాంతంలో ఇటీవలే 11 ఎకరాల స్థలాన్ని కూడాప్రభుత్వం కేటాయించింది. ఈ భూములన్నింటి ధరలను పరిగణనలోకి తీసుకుంటే జాతీయ పార్టీలకు ఏ మాత్రం తీసిపోని తీరులో ధనిక పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించింది. కార్పొరేట్ సంస్థల నుంచే సుమారు రూ.77 కోట్లు సమకూరాయి.

ఈ విరాళాలన్నీ రూ.20 వేల కంటే ఎక్కువ మొతాదులో వచ్చినవే. పార్టీ సభ్యత్వం ద్వారా సమకూరే తక్కువ మొత్తంలోని మెంబర్‌షిప్ ఫీజు, ఎలక్షన్ ఫండ్, పార్టీ ఫండ్ తదితరాలన్నీ ఈ ఆస్తులకు అదనం. ఆఫీసు భవనాలు, ఫర్నీచర్, ఫిక్స్ డ్ డిపాజిట్లు, వాటి మీద వచ్చే వడ్డీ తదితరాలన్నీ ఈ జాబితాలో చేరలేదు. ఆ ప్రకారం చూస్తే బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఆస్తులు మరే ఇతర ప్రాంతీయ పార్టీకి ఉండవని తెలుస్తున్నది.

ప్రతి జిల్లాలో ఇప్పటికే సొంతంగా పార్టీ ఆఫీసులండగా ఢిల్లీలో, మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్ తదితర జిల్లాల్లోనూ ఇటీవలే ఏర్పాటు చేసుకున్నది. త్వరలో నాగ్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోనూ సొంత ఆఫీసులను సమకూర్చుకూడానికి సిద్ధమవుతున్నది. వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని భావిస్తున్న బీఆర్ఎస్ వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నది.రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి ఇటీవలే జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలోని మొత్తం రాజకీయ పార్టీల్లో 11వ స్థానంలో నిలిచింది.

ఆరేండ్లలో ఈ పార్టీ ఆదాయం రూ.169.70 కోట్లు. తమిళనాడు 1960వ దశకం చివరి నుంచీ యాక్టివ్‌గా ఉంటూ పదకొండు సార్లు అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి వచ్చిన విరాళాలు 475.73 కోట్లు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి విరాళాల ద్వారా ఈ ఆరేండ్లలో వచ్చింది రూ.168 కోట్లు మాత్రమే. ఈ పార్టీ కన్నా సుమారు రెండున్నర రెట్లకు పైగా డొనేషన్లను బీఆర్ఎస్ పొందగలిగింది.

ఫస్ట్ టైమ్ పవర్‌లోకి వచ్చిన వైసీపీ సైతం టీడీపీ కన్నా ఎక్కువ విరాళాలనే (మొత్తంగా రూ.456.20 కోట్లు) పొందగలిగింది. ఇందులో రూ.102 కోట్లు కార్పొరేట్ సంస్థల ద్వారా సమకూరితే రూ.330 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చింది.

2016-22 మధ్య జాతీయ, ప్రాంతీయ పార్టీలకు వచ్చిన డొనేషన్లు రూ.కోట్లలో)

బీజేపీ – 10,122,03, కాంగ్రెస్ – 1,547.43, తృణమూల్ – 823.30, బీజేడీ – 692.60, బీఆర్ఎస్ – 476.89, డీఎంకే -475.73, వైసీపీ -456.20

Related posts

పిబిఎస్ వృద్ధాశ్రమంలో జయశంకర్ వర్ధంతి

Satyam NEWS

రాఫెల్ ఫైటర్ జెట్ ల కొనుగోలులో ముడుపులు?

Satyam NEWS

పంజాబ్ కాంగ్రెస్‌లోకి ప్రముఖ సింగర్ సిద్ధూ మూసీవాలా

Sub Editor

Leave a Comment