38.2 C
Hyderabad
April 29, 2024 22: 09 PM
Slider గుంటూరు

సీఎం నరసరావుపేట పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

#narasaraopet

ఏప్రిల్ 4న పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ వివేక్ యాదవ్, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తో కలిసి సీఎం సభాస్థలిని పరిశీలించారు. సత్తెనపల్లి రోడ్డులోని జిల్లా క్రీడా ప్రాంగణం సభా ప్రాంగణంగా నిర్ణయించారు.

ఎస్ఎస్ & ఎన్ కళాశాల మైదానం హెలిప్యాడ్ కోసం కేటాయించారు. అనంతరం సభాస్థలి, హెలిప్యాడ్, పార్కింగ్, ట్రాఫిక్, క్యూ మేనేజ్మెంట్ తో పాటు తదితర అంశాలపై మున్సిపల్ గెస్ట్ హౌస్ లో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి సీఎం వస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల సమన్వంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శాసనసభ్యులు గోపిరెడ్డి కోరారు. ఎండాకాలం నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మందిని సభాస్థలి వరకు డ్రాప్ చేసి వాహనాలు తిరిగి వెళ్లేలా ఏర్పాటు చేయాలి అన్నారు.

సీఎం కి ఘనస్వాగతం పలికేందుకు పల్నాడు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ఏప్రిల్ 4న జరిగే సభకి 25 వేల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. రాయలసీమ తరవాత పల్నాడు ప్రాంతానికే  సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.  పల్నాడు గుండెల్లో పెట్టుకున్న సీఎం కి నరసరావుపేట ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, అన్ని శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, నరసరావుపేట

Related posts

ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు

Satyam NEWS

సెల్ఫ్ క్వారంటైన్ నుంచి జంప్ అయిన ఎన్నారై లపై క్రిమినల్ కేసు

Satyam NEWS

హెంగార్డు నిజాయితీ…20వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ అప్పగింత…!

Satyam NEWS

Leave a Comment