20.7 C
Hyderabad
December 10, 2024 01: 26 AM
Slider సినిమా

ఉప్పెన షూటింగ్ లో విజయ్ సేతుపతి

Vijay-Sethupathi 23

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ఉప్పెన. వైష్ణవ్ సరసన ఈ చిత్రంలో కృతి షెట్టి హీరోయిన్ గా నటిస్తున్నది. తమళ స్టార్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిన్నటి నుంచి విజయ్ సేతుపతి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు సానా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారథి స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్స్ మోనిక, రామకృష్ణ వేసిన భారీ సెట్‌లో ప్రస్తుతం సినిమా చిత్రీకరణను జరపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో వైష్ణవ్ తేజ్, రాజీవ్ కనకాల,  హీరోయిన్ క్రితి శెట్టి, అలాగే 500 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 40 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, పతాకాలపై ఈ సినిమా నిర్మితమవుతోంది. 

Related posts

నత్తనడకన సిద్ధవటం హైలేవల్ వంతెన మరమ్మతు పనులు…

Satyam NEWS

యువత సేవా దృక్పథంతో ముందుకు సాగాలి

Sub Editor

సంబరంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం

Satyam NEWS

Leave a Comment