రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేయడం ఎంతో దురదృష్టకరమని కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. దీని వల్ల కేంద్ర నుండి రాష్ట్రానికి రావాల్సిన 5 000 కోట్ల రూపాయల నిధుల్ని వదులుకోవాల్సి న పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు.
ఇపుడున్న ఈసీ నిమ్మగడ్డ రమేష్ టీడీపి అధ్యక్షుడు చంద్ర బాబు మనిషి అని ఆరోపించారు. ఎవరో వెనకుండి ఈ ఎన్నికలను ఆపించేసారని అనుమానం వ్యక్తం చేశారు. చంద్ర బాబు కు పిచ్చి పట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడాడే తప్ప ఎక్కడ పెద్దగా గొడవలు జరగలేదని అన్నారు. చంద్ర బాబు హయం లో తలలు పగలకొట్టిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని కొరముట్ల అన్నారు.