35.2 C
Hyderabad
May 29, 2023 21: 09 PM
Slider సినిమా

షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన అమితాబ్

#amitabhbachan

మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అభిమానులకు ఓ చేదువార్త. హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో బిగ్‌బీకి తీవ్రగాయాలయ్యాయి. అమితాబ్ ‘ప్రాజెక్ట్ కె’ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరగడంతో సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. హైదరాబాద్‌లో చికిత్స పొందిన తర్వాత అమితాబ్ ముంబైలోని తన ఇంటికి తిరిగి వచ్చారు.

ఈ సమాచారాన్ని ఆయన తన బ్లాగ్‌లో అభిమానులతో పంచుకున్నారు. తాను తీవ్రమైన శరీర నొప్పితో బాధపడుతున్నానని, డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నానని బ్లాగ్ లో రాశారు. అమితాబ్ బచ్చన్ ‘ప్రాజెక్ట్ కె’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా బిగ్ బీ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో పక్కటెముకలు, కండరాలకు తీవ్ర గాయాలు అయ్యాయని అమితాబ్ తెలిపారు.

అనంతరం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముంబైలోని తన ఇంటికి తిరిగి వచ్చారు. వైద్యులు డిశ్చార్జ్ ఇచ్చారు, కానీ అమితాబ్ ఇప్పటికీ చాలా నొప్పిని అనుభవిస్తున్నారు. తన గాయం గురించి సమాచారం ఇస్తూ, ఇది చాలా బాధాకరమైనదని అమితాబ్ బచ్చన్ అన్నారు. నడవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కుంటున్నట్లు చెప్పారు. సాధారణ స్థితికి రావడానికి కొన్ని వారాలు పడుతుంది. నొప్పులకు వైద్యులు కూడా మందులు ఇచ్చారు. సాధారణ రొటీన్ పనులను సొంతంగా చేసుకోగలిగినప్పటికీ, పూర్తిగా ఫిట్‌గా మారడానికి చాలా సమయం పడుతుంది.

Related posts

సీఎం జగన్ బాబాయ్ హత్య కేసు పై పురోగతి ఎందుకు లేదు?

Satyam NEWS

డ్యూటీ:కాన్వయ్ లో బాధితుడు ఆసుపత్రికి తరలింపు

Satyam NEWS

కాళేశ్వరం జలాలతో కరీంనగర్ సస్యశ్యామలం

Bhavani

Leave a Comment

error: Content is protected !!