తొమ్మిది నెలల కాలంలో వైసిపి పాలన ఎంతో అద్భుతంగా సాగిందని, ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారని ఇప్పటికే పలుమార్లు రుజువు అయిందని కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ విషయాలు తెలుసుకున్న చంద్రబాబు, మరో గత్యంతరం లేక ఎలక్షన్స్ వాయిదా వేయించడం దారుణమని ఆయన అన్నారు.
కరోనాను సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేయడం చాలా దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి చంద్రబాబు, ఆనాడు టిడిపి ఎంపీటీసీ లను విమానాలు పెట్టి తరలించడాన్ని మరిచారా అని విమర్శించారు.
పాండిచ్చేరిలో రిసార్ట్ లు బుక్ చేసి అధికార యంత్రాంగం ట్రైనింగ్ ఇవ్వడం దారుణం కాదా అన్నారు. నీచ పాలిటిక్స్ ఈ రాష్ట్రానికి నేర్పిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన విమర్శించారు. తక్కువ సమయంలో ఎంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్న వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు ఓర్వలేక కుట్ర పన్నుతున్నాడన్నారు.
రాష్ట్రంలో పలు చోట్ల ఓడిపోతామన్న భయం తో విత్ డ్రా చేసుకొని టిడిపి కుంటిసాకులు చెబుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని నాయకులు, అధికారులు బెదిరింపులకు పాల్పడినట్లయితే నిరూపించాలని ఆయన అన్నారు. ఎలక్షన్ లు వాయిదా పడితే రాష్ట్రానికి నష్టమని ఆయన అన్నారు. మూడు నుంచి నాలుగు వేల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావన్నారు. మేనేజింగ్ పాలిటిక్స్ లాబీ పాలిటిక్స్ చేస్తే ప్రజలు చంద్రబాబును ఈ రాష్ట్రం నుండి తరిమి కొడతారన్నారు.