శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రునివలస లో పొట్టి శ్రీరాములు 121వ జయంతి వేడుకలను ప్రధానోపాధ్యాయులు ఐడి వి ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఐడి వి ప్రసాద్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు కార్యదీక్ష కలవారని, ఉప్పు సత్యాగ్రహం లో ప్రముఖ పాత్ర వహించారని తెలిపారు.
అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి చివరకు అసువులు బాసారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కే. శ్రీహరి బి. ప్రభాకర్ రావు , బి.వి. అరుంధతీ దేవి, బి. అప్పలనాయుడు, డి. అప్పారావు ,పి. వసంతరావు, జి.వినయ్ కుమార్, ఆర్. సతీష్ రాయుడు, టి. పద్మావతి, పి. మోహన్ తదితరులు పాల్గొన్నారు.